తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణను రూపొందించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈరోజు సాయంత్రం జూమ్ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది. ఈనేపథ్యంలో.. నేరుగా సమావేశం పెట్టకుండా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు.
నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్‌ఎస్ శ్రేణులు దాడి సంచలనంగా మారింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనిపై స్పందించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి పేరు వినగానే.. పెద్ద వెంట్రుకలు, గుబూరు గడ్డమే గుర్తుకు వస్తుంది.. ఆయన రాజకీయాలపై గంభీరంగా ఎంత ముక్కుసూటిగా మాట్లాడతారో.. ఆయన ఎయిర్ స్టైల్, గడ్డం, నడక తీరు కూడా అంతే గంభీరంగా ఉంటాయి.. జగ్గారెడ్డిని గడ్డం లేకుండా.. పొడవాటి వెంట్రుకలు లేకుండా చూసింది చాలా అరుదనే చెప్పాలి.. ఎన్నికలకు ముందు.. ఫలితాల తర్వాత ఇలా ఎప్పుడూ.. ఆయన ఇదే గెటప్‌తో కనబడుతుంటారు.. అయితే, ఇప్పుడు ఆయన పూర్తిగా…