ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి ఆదిమూలపు సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పార్టీ పెద్దలు. అతి కొద్ది కాలంలోనే మనం అధికారంలోకి వచ్చాం. రాష్ట్ర ప్రజలంతా మన పార్టీ వైపు చూస్తున్నారు. నవరత్నాల్లాంటి సంక్షేమ కార్యక్రమాలతో…
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. కోవిడ్ వల్ల రెండేళ్ల నుంచి దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ప్రభుత్వానికి ఉద్యోగులను మూలస్తంభాలుగా భావిస్తున్నాం. ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం. 2020-21 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధిస్తుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. వైయస్ఆర్ చేయూత ద్వారా 45-60 ఏళ్ల మహిళలకు రూ.9,100 కోట్లు అందించామని…
బీజేపీ కార్యాలయంలో ఫొటోగ్రాఫర్ల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా హాజరయ్యారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. వివిధ జిల్లాల నుంచి సమావేశానికి హాజరయ్యారు ఫొటో గ్రాఫర్లు. ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. ఆత్మనిర్భర్ భారత్ లో చేతి వృత్తుల వారిని ప్రోత్సహించాలని మోడీ చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసేందుకు మోడీ పాలనే కారణం. రష్యా, ఉక్రెయిన్ యుద్దం పెద్ద ఎత్తున జరుగుతుంది. వారి మధ్యలో మధ్యవర్తిత్వం నిర్వహించే…
ప్రజాస్వామ్య భావాలపై విశ్వాసం ఉన్న నాయకులు వైసీపీని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి సంకుచిత మనస్తత్వంతో నియంతలా ఆలోచిస్తున్నారు. ప్రజాస్వామ్యం కోసం.. రాష్ట్రాభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ తో కలసి నడిచేందుకు రండి. ప్రజల కోసం పని చేయాల్సిన రెవెన్యూ సిబ్బందిని సినిమా హాళ్ల దగ్గరకు పంపారు. అహంభావానికి, ఆత్మగౌరవానికి జరిగే పోరులో గెలిచేది ఆత్మ గౌరవమే అని నిరూపించారు. సంయమనంతో… సహనంగా ఉన్న జన సైనికులకు, అభిమానులకు అభినందనలు. అహంభావానికి,…
టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేస్తే చంద్రబాబు డొంక కదులుతుందనే భయంతోనే లోకేష్ వైజాగ్ వచ్చారన్నారు. టీడీపీ హయాంలో చేసిన గంజాయి సాగు లావాదేవీలు, అక్రమాలు బయట పడతాయని భయంతో విశాఖ వచ్చారు అని విమర్శించారు అమర్నాథ్. 41 నోటీసు ఇస్తే ఎందుకు ఉలికి పాటు. రాజ్యాంగంలో వున్న పెద్దలపై తప్పుడు మాటలు మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తాగుబోతు కారు నడిపితే, పిచ్చోడి…
ఏపీలో జగన్ పాలనా తీరుపై తనదైన రీతిలో విమర్శలు చేశారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ప్రభుత్వంతో పోరాడి గెలిచిన సర్పంచ్‌లే నిజమైన హీరోలు అన్నారు. జగన్ లాంటి సీఎంను నా జీవితంలో ఇప్పటి వరకూ చూడలేదు.గ్రామ పంచాయతీల పరిధిలో ఉండే మైనింగ్, ఇసుక క్వారీలపై పంచాయతీలదే అధికారం అన్నారు. నరేగా నిధులు కూడా పంచాయతీలకు రావాల్సిందే. పంచాయతీలకు రావాల్సిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటే దొపిడీ అనాలా..? ఇంకేమైనా అనాలా..? రాష్ట్రానికి రావాల్సిన డబ్బులను…
ఏపీలో ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్. ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజారెడ్డి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయ్యన్నపాత్రుడు మొదటిసారి మంత్రి అయ్యేటప్పటికి జగన్ పాలుతాగుతున్నాడు.అయ్యన్నపాత్రుడు ని ఎదుర్కోలేక ముఖ్యమంత్రి పోలీసులను పంపిస్తున్నారని విమర్శించారు. ఇక్కడ పోలీసులు మోహరింపు, నిర్బంధం చూస్తే నర్సీపట్నంలో ఉన్నామా ఉక్రెయిన్లో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు లోకేష్. అయ్యన్నపాత్రుడు పై 9 కేసులు పెట్టారు….అందులో నిర్భయ చట్టం కింద ఉండటం దారుణం. ఇప్పటి వరకు…
ఏపీలో అధికార విపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతూనే వున్నాయి. మా మంత్రి చనిపోయిన షాక్ లో మేముంటే ఆయనపై కూడా నీచంగా మాట్లాడుతున్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం దుర్మార్గం అన్నారు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాష్ట్రంలో ఒక ప్రజా పరిపాలన కొనసాగుతుంటే దాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. కరకట్ట పై అక్రమంగా నివాసం ఉంటూ దాన్ని కుట్ర కోటగా మార్చాడు. అత్యున్నత సంస్థ దర్యాప్తు కొనసాగుతోంది…దాన్ని మేము కూడా ఆహ్వానించాం. కానీ దర్యాప్తులో…
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాకు బయలుదేరుతున్నారు. ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కడపకు వెళ్లనున్నారు. కడప నుంచి హెలికాఫ్టర్ ద్వారా ఉదయగిరి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సెస్ కాలేజీకీ చేరుకుంటారు. అక్కడ దివంగత మేకపాటి గౌతం రెడ్డి బౌతికకాయానికి నివాళులు ఆర్పించి అంత్యక్రియల్లో పాల్గొంటారు. Read:…