Nara Lokesh: స్టయిల్ మార్చిన చినబాబు.. డైలాగ్స్ తో కెవ్వుకేక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ ఆవిర్భావ సభలో సంచలన కామెంట్లు చేసిన లోకేష్ గురించి తెలుగునాట చర్చ సాగుతోంది. గతంలో తనపై వచ్చిన విమర్శలు, తన మాటతీరుపై వచ్చిన వ్యంగ్యాస్త్రాలను దాటుకుని తన స్టయిల్ మార్చేశారు చంద్రబాబు తనయుడు లోకేష్. తాను చంద్రబాబు తరహా కాదని.. మూర్ఖుడినన్నారు లోకేష్.తన మామ బాలయ్య బాబు డైలాగులతో ఆవిర్భావ సభలో ప్రసంగించిన లోకేష్ తీరుని చూసి క్యాడర్ అవాక్కవుతున్నారు. చినబాబు కెవ్వుకేక అంటున్నారు.
2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి మీద రూ. 2 లక్షల అప్పు ఉండబోతోంది. సమయం లేదు మిత్రమా..? ఇంకా రెండేళ్లే సమయం ఉంది.. ప్రజల్లోకి వెళ్లాలి. ఎన్టీఆర్ దేవుడు.. చంద్రబాబు రాముడు.. లోకేష్ మూర్ఖుడు. చట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలను అధికారులను వదిలి పెట్టను. అమెరికా కాదు.. ఐవరీ కోస్టుకు వెళ్లినా వదిలి పెట్టను. తల్లి బాధేంటో నాకు తెలుసు.. రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు పనులు చేసిన అధికారులను వదిలి పెట్టను.. నేను అన్నీ గుర్తు పెట్టుకుంటాను.
Also Read
- AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
- Saikrishna Lockup Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం..
- MP Mithun Reddy: తమను ఇబ్బంది పెట్టినా భరిస్తాం.. కానీ, కేడర్ జోలికి వస్తే ఊరుకోం.. మిథున్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
అధికారంలోకి వచ్చాక నాతో మాట్లాడాలంటే 12 కేసులుండాల్సిందే. 12 కేసులకంటే తక్కువగా ఉన్నాయంటే వైసీపీపై పోరాడ లేదని అర్ధం. గతంలో కేసులు పెట్టుకోవాలంటే కొంచెం నామోషీగా ఉండేది.. కానీ ఇప్పుడు కాలం మారింది. ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఇప్పుడిలాగే ఉండాలి. రికార్డులు సృష్టించాలన్నా.. తిరగ రాయాలన్నా టీడీపీకే సాధ్యం…. ఇది సిల్వర్ స్క్రీన్ సింహా అల్లుడి సింహనాదం.
టీడీపీ అన్ స్టాపబుల్. టీడీపీ ప్రజల పార్టీ.. జగనుది గాలి పార్టీ. మహిళలకు ఆస్తిలో టీడీపీ సమాన హక్కు కల్పిస్తే.. ఆ హక్కు లేదంటూ తల్లిని-చెల్లిని జగన్ పక్క రాష్ట్రానికి తరిమేశారు. టీడీపీది బ్రాండ్ కియా అయితే.. వైసీపీది కోడి కత్తి బ్రాండ్. టీడీపీ పసుపు కుంకమ ఇస్తే.. వైసీపీ పసుపు కుంకుమలు చెరిపేస్తోందంటూ సెంటిమెంట్ డైలాగులు వల్లించారు. ఫించన్ పెంచుకుంటూ పోతానన్న జగన్.. నిత్యావసరాల ధరలను పన్నులను సీఎం జగన్ పెంచుతూ పోతున్నారు. రాముడు లాంటి చంద్రన్న కావాలా..? రాక్షసుడు లాంటి జగన్ కావాలా..?
చంద్రబాబు లాంటి విజనరీ కావాలా..? జగన్ లాంటి ప్రిజనరీ కావాలా..? సమాజంలో సగం ఉన్న బీసీలకు అధికారం అందించిన పార్టీ టీడీపీనే. ఎంతో మంది ఉన్నత విద్యావంతులను రాజకీయాలకు పరిచయం చేసింది ఎన్టీఆరే. దళితులను లోక్ సభ, అసెంబ్లీ స్పీకరులుగా చేసిన ఘనత టీడీపీదే. దేశంలో సంక్షేమానికి పునాది వేసింది ఎన్టీఆర్.. అభివృద్ధి చేసి చూపింది చంద్రబాబు. అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది ఎన్టీఆర్. దేవుడు ఎన్టీఆర్.. రాముడు చంద్రబాబు. ఆర్టికల్ 356ను వాడి ప్రభుత్వాలని మారిస్తే.. తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ టీడీపీనే. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీకి ప్రతిపక్ష హోదా సాధించిన ఏకైక పార్టీ టీడీపీ. జాతీయ స్థాయిలో ప్రభావం చూపిన వ్యక్తులు ఎన్టీఆర్, చంద్రబాబు. పరిపాలనా కేంద్రీకరణ.. అభివృద్ధి వికేంద్రీకరణే టీడీపీ లక్ష్యం.
1985లోనే మంగళగిరిలో టీడీపీ జెండా ఎగిరింది.. మళ్లీ 2024లో టీడీపీ జెండా ఎగరేయాలి.. చరిత్ర తిరగ రాయాలి. కార్యకర్తల సంక్షేమం చూసే బాధ్యత నాకు దక్కింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది.. పెద్ద ఎత్తున సభ్యత్వం చేపట్టాలన్నారు. లోకేష్ మాటతీరు, తెగువ పెరిగిందని తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు.
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!