ఏపీ–అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టులో భాగంగా గుంటూరు జిల్లాలో పాల సేకరణను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు సీఎం జగన్ గుంటూరు జిల్లాలో కొత్తగా 129 గ్రామాలతో పాటు, చిత్తూరు జిల్లాలో అదనంగా మరో 174 గ్రామాల నుంచి అమూల్ ద్వారా పాల సేకరణను విధానాన్ని ప్రారంభించారు సీఎం జగన్. అయితే ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలలో అమూల్ పాలసేకరణ కొనసాగుతుంది. ఇక సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ… ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం.…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కేసులు ఐదువేలు దాటిపోతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా నివారణ, వ్యాక్సినేషన్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించబోతున్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లతో ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కాబోతున్నారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు.
ఉగాది పండుగ పూట జగన్ ప్రకటించాలనుకున్న జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం ప్రకటించ లేకపోయింది. దీన్ని వచ్చే నెల 30వ తేదీ నాటికి వాయిదా వేసినట్లు సమాచారం. జాబ్ క్యాలెండర్ ప్రకటన విషయంలో సీఎస్ స్థాయిలో కూడా అన్ని రకాల ప్రక్రియలు పూర్తి అయినా.. ఫైనాన్స్ శాఖ నుంచి క్లియరెన్స్ లేకపోవడం వల్ల అనుకున్న సమయానికి జాబ్ క్యాలెండర్ ప్రకటించలేకపోయారనే చర్చ జరుగుతోంది. మే నెల 30 నాటికి సీెఎంగా జగన్ పాలనా పగ్గాలు చెపట్టి రెండేళ్లు…
రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కావడంతో బిజేపి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు. తిరుపతిలో అన్యమత ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతోందని అన్నారు. ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అది, ఆనవాయితీగా అందరూ చేస్తారు. కానీ, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి మాత్రం గూడూరు లో చర్చి కెళ్లి బిషప్ ఆశీర్వాదం తీసుకున్నారు. గురుమూర్తి హిందువా..!? కాదా..!? స్పష్టంగా…
భారతదేశ పరిపాలన వ్యవస్థలో వాలంటీర్ల వ్యవస్థ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం జిల్లా రాజాంలో వాలంటీర్లకు సేవ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో కలిసి పాల్గొన్నారు. దేశంలోనే వాలంటీర్ వ్యవస్థ ఎంతో అద్భుతమైనదని..కానీ కొందరు వాలంటీర్లకు రాజకీయాలు అంటగడగుతున్నారని మండిపడ్డారు. ఎవరేమనుకున్నా వాలంటీర్లు పట్టించుకోనవసరం లేదని..వాలంటీర్లకు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజల్లో అసంతృప్తి ఒక్క శాతం కూడా ఉండటానికి వీల్లేదు …గో ఎహెడ్ అంటూ…
గుంటూరు జిల్లా నర్సారావుపేటలో కాలేజీ విద్యార్థిని అనూష హత్య ఘటనపై సీఎం వైఎఎస్ జగన్ ఆరా తీసినట్టు చెబుతున్నారు. సీఎంఓ అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఈకేసులో కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దిశ చట్టం కింద వెంటనే దర్యాప్తు పూర్తిచేసి విచారణ వేగంగా జరిగేలా చూడాలని సీఎం కోరారు. దోషిత్వాన్ని నిరూపించి కఠినశిక్ష పడేలా చూడాలన్న జగన్ అనూష కుటుంబానికి రూ.10…