Ap Assembly: ప్రభుత్వ పథకాలతో సమగ్రాభివృద్ధి:గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. కోవిడ్ వల్ల రెండేళ్ల నుంచి దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ప్రభుత్వానికి ఉద్యోగులను మూలస్తంభాలుగా భావిస్తున్నాం. ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం. 2020-21 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధిస్తుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. వైయస్ఆర్ చేయూత ద్వారా 45-60 ఏళ్ల మహిళలకు రూ.9,100 కోట్లు అందించామని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. వైయస్ఆర్ కాపు నేస్తం కింద ఐదు విడతల్లో రూ. 75 వేల చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు పేర్కొన్నారు
ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం అవుతుంది. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మెరుగైన వృద్ధి. పాలన కింద స్థాయికి వరకు విస్తరించేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయి.మన బడి నాడు – నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి.తొలి దశలలో రూ.3,669 కోట్లు ఖర్చు చేసి 17,715 పాఠశాలలను అభివృద్ధి చేశాం.
Also Read
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
- Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
44.5 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి కింద రూ.13,023 కోట్లు అందజేశాం.జగనన్న వసతి దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.2,304 కోట్లు జమ.కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ప్రతిపాదించాం.శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు.రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.13, 500 చొప్పున ఆర్థిక సాయం అందించాం. ఇప్పటి వరకు 52.38 లక్షల మంది రైతులకు రూ.20,162 కోట్ల సాయం.
9 గంటల ఉచిత విద్యుత్ పథకం కింద 18.55 లక్షల మంది రైతులకు ప్రయోజనం.2021-22లో రూ.9,091 కోట్ల వ్యయంతో రైతులకు ప్రయోజనం చేకూర్చాం. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,04,758 గా ఉంది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 81,703 మంది లబ్ధిదారులకు రూ.577 కోట్లు అందించాం. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో, టాక్సీ డ్రైవర్లకు సాయం. జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయిబ్రాహ్మణులకు రూ.583 కోట్లు సాయం. 2.7 లక్షల ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ.770 కోట్ల సాయం. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు రూ.1,416 కోట్ల సాయం.
వైఎస్ఆర్ ఆసరా కింద 78.75 లక్షల మందికి సాయం. స్వయం సహాయక సంఘాలకు రూ.12,758 కోట్లు అందించాం.వైఎస్ఆర్ కాపు నేస్తం కింద ఐదు విడతల్లో ఒక్కొక్కరికీ రూ.75వేల చొప్పున సాయం.కాపు నేస్తం కింద ఇప్పటి వరకు రూ.981.88 కోట్లు అందించాం.ఈబీసీ నేస్తం కింద ఏడాదికి అర్హులైన ఒక్కొక్కరికీ రూ.15వేల సాయం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 81,703 మంది లబ్ధిదారులకు రూ.577 కోట్ల సాయం.
జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు రూ.1,416 కోట్ల సాయం.వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రూ.2,354 కోట్లు అందించాం.వైఎస్ఆర్ చేయూత ద్వారా 45-60 ఏళ్ల మహిళలకు రూ.9100 కోట్లు.పాలన కింది స్థాయి వరకు వెళ్లేందుకు గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయి.విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మెరుగైన అభివృద్ధి.రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చేయూత.
దేశ జీడీపీ 7.3 శాతం తగ్గింది.2020-21 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82శాతం సమగ్రాభివృద్ధి సాధిస్తుంది.గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధి కోసం రూ.6,400 కోట్లు వ్యయం.3 వేల కి.మీ పొడవైన 2 లైన్ల రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం.పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి.2023 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసేలా యుద్ధ ప్రాతిపదికన పనులు.వేగవంతమైన అభివృద్దికి వ్యూహాత్మకమైన మౌలిక సదుపాయాలు. భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం వద్ద 3 ఓడరేవుల అభివృద్ధి.
తాజావార్తలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!