ఏపీలో ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్. ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజారెడ్డి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయ్యన్నపాత్రుడు మొదటిసారి మంత్రి అయ్యేటప్పటికి జగన్ పాలుతాగుతున్నాడు.అయ్యన్నపాత్రుడు ని ఎదుర్కోలేక ముఖ్యమంత్రి పోలీసులను పంపిస్తున్నారని విమర్శించారు.
ఇక్కడ పోలీసులు మోహరింపు, నిర్బంధం చూస్తే నర్సీపట్నంలో ఉన్నామా ఉక్రెయిన్లో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు లోకేష్. అయ్యన్నపాత్రుడు పై 9 కేసులు పెట్టారు….అందులో నిర్భయ చట్టం కింద ఉండటం దారుణం. ఇప్పటి వరకు 3250కేసులు టీడీపీ నేతలపై పెట్టారు.అధికారం అడ్డు పెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్న వాళ్ళెవరినీ మేం వదిలిపెట్టం అన్నారు లోకేష్.
నాపై 307కింద కేసు పెట్టారు… బెయిల్ తీసుకో కుండా నిలబడ్డా. ఏం పీక గలిగారు? వైసీపీ కార్యకర్తలను కోరుతున్నాం. పోలీసులు లేకుండా బయటకు రండి చూద్ధాం. పోలీసులను అడ్డం పెట్టుకుని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే మనిషి లోకేష్ కాదు….ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు గుయ్యిమనిపిస్తా. కేసులకు భయపడేదే లేదు. కేసులు ఉండబట్టే జగన్ రెడ్డి ఢీల్లీ ముందు తలొంచి నిలబడ్డాడని సంచలన వ్యాఖ్యలు చేశారు లోకేష్.
పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ అయ్యన్నపాత్రుడు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. అయ్యన్నపాత్రుడుపై తదుపరి చర్యలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.