టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో టీడీపీ అధినేత చంద్రబాబు చిట్ చాట్ చేశారు. జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై ఈ స్థాయి ప్రజా వ్యతిరేకత లేదు చరిత్రలో చూడలేదు. ప్రభుత్వాలు విఫలం అవ్వడం వేరు.. పాలనపై ఈ స్థాయి అసంతృప్తి వేరు. టీడీపీ అత్యధిక సీట్లు గెలుచుకున్న 1994లో కూడా అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత లేదన్నారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి.…
మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది కేబినెట్ బెర్త్ ఆశించారు. చివరకు జిల్లాలు.. సామాజికవర్గాల వారీగా ఎమ్మెల్యేలను ఎంపిక చేసి ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్. ఈ క్రమంలో మంత్రివర్గంలో చోటు కోసం జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు చాలా పోటీపడ్డారు. సామాజిక సమీకరణాలను లెక్క చేయకుండా లాబీయింగ్ చేసిపడేశారు కూడా. చివరకు పోటీ పడినవ వారికి కాకుండా.. సైలెంట్‌గా ఉన్నవారికి అవకాశం దక్కింది. చాలా జిల్లాల్లో జరిగింది ఇదే. ఈ జాబితాలో ఉమ్మడి అనంతపురం జిల్లా…
గృహనిర్మాణ శాఖపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఇళ్లపట్టాలు కోసం చేసిన ఖర్చు కాకుండా కేవలం నిర్మాణం కోసమే గడచిన ఆర్థిక సంవత్సంలో సుమారు రూ.3,600 కోట్లు ఖర్చుచేసింది ప్రభుత్వం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.13,105 కోట్లు గృహ నిర్మాణం కోసం ఖర్చు చేయనుంది ప్రభుత్వం. ఈ ఏడాది 35 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు, 3.46 లక్షల మెట్రిక్‌టన్నుల స్టీల్‌ను ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించనుంది ప్రభుత్వం. కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల…
ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం విస్తరణ వివాదాలు రేపింది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ అసంతృప్తికి లోనయ్యారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిది అదే కథ. అయితే ఆయన ఇప్పుడిప్పుడే ఆ షాక్ నించి బయటకు వస్తున్నారు. తాజాగా ఆయన టీడీపీ, జనసేనపై కీలక కామెంట్లు చేశారు. టీడీపీని సమాధి చేద్దామని నా వెంట వస్తున్న వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు. టీడీపీ హయాంలో జాకీ వెళితే.. దొంగలు పడ్డ ఆరు…
ఏపీలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. కేబినెట్ కూర్పుపై మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ది ఛాయ్, బిస్కెట్ కేబినెట్టేనంటూ యనమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్నది ఛాయ్, బిస్కెట్ కేబినెట్. గతంలో జగన్ ది పప్పెట్ కేబినెట్ అయితే.. ఇప్పుడు ఛాయ్ బిస్కెట్ కేబినెట్ అన్నారు యనమల. జగన్ కేబినెట్‌లో మంత్రులకు స్వేచ్ఛ లేదు. జగన్ కిచెన్ కేబినెట్టులోనో.. సలహాదారుల బృందంలో బీసీలు ఎందుకు లేరు..? నిర్ణయాలు తీసుకునే కోర్ కమిటీ..…
మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ వార్తలు వచ్చాయి. దాన్ని ఆరోజే ఖండించాను. మాపై ఇలాంటివి రాసిన వారిపై పరువునష్టం దావా వేస్తా అని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. సీఎం ఆలోచన ప్రకారమే పదవులు ఇస్తారు. మంత్రి పదవి కోసం ఎప్పుడూ నేను పాకులాడలేదు. ఆరోజు చెప్పగానే 24 మంది రాజీనామా చేశాం. మంత్రి పదవి లేనప్పుడు కొంచెం ఫీల్ అవటం ఎవరికైనా ఉంటుందన్నారు. అంతకుమించి ఇంకేమీ లేదు. నేను వైయస్సార్ ఫ్యామిలీ…
సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఏమీ లేదు. జాబితా సాయంత్రం తర్వాత విడుదల అవుతుందన్నారు సజ్జల. సీఎంతో మరో భేటీ ఏమీ లేదు. రాత్రి ఏడు గంటలకు రాజ్ భవన్‌కు జాబితా పంపిస్తాం అని చెప్పారు. మంత్రుల జాబితా ఫైనల్ లిస్ట్ సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది.
రాబోయే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధిస్తామన్నారు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా చంద్రబాబునాయుడు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు తెలంగాణలో కూర్చుని ఏపీలో పాలన పై బురద జల్లుతున్నారు. విమర్శించే ముందు ఏపీ ప్రజల మనోభావాలు తెలుసుకుంటే మంచిదన్నారు. 2019లో 151 మంది ఎమ్మేల్యేలు, 23 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారు. ఈసారి ఎన్నికల్లో మరింత గొప్ప విజయం అందించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు.…
టీడీపీ ఆవిర్భావ సభలో సంచలన కామెంట్లు చేసిన లోకేష్ గురించి తెలుగునాట చర్చ సాగుతోంది. గతంలో తనపై వచ్చిన విమర్శలు, తన మాటతీరుపై వచ్చిన వ్యంగ్యాస్త్రాలను దాటుకుని తన స్టయిల్ మార్చేశారు చంద్రబాబు తనయుడు లోకేష్. తాను చంద్రబాబు తరహా కాదని.. మూర్ఖుడినన్నారు లోకేష్.తన మామ బాలయ్య బాబు డైలాగులతో ఆవిర్భావ సభలో ప్రసంగించిన లోకేష్ తీరుని చూసి క్యాడర్ అవాక్కవుతున్నారు. చినబాబు కెవ్వుకేక అంటున్నారు. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి మీద రూ. 2…