బీజేపీ కార్యాలయంలో ఫొటోగ్రాఫర్ల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా హాజరయ్యారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. వివిధ జిల్లాల నుంచి సమావేశానికి హాజరయ్యారు ఫొటో గ్రాఫర్లు. ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. ఆత్మనిర్భర్ భారత్ లో చేతి వృత్తుల వారిని ప్రోత్సహించాలని మోడీ చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసేందుకు మోడీ పాలనే కారణం.
రష్యా, ఉక్రెయిన్ యుద్దం పెద్ద ఎత్తున జరుగుతుంది. వారి మధ్యలో మధ్యవర్తిత్వం నిర్వహించే స్థాయిలో మోడీ ఉండటం గర్వకారణం. ఏపీ విద్యార్థులు అనేక మంది వివిధ దేశాలలో చదువుకుంటున్నారు. భవిష్యత్తులో ఇతర దేశాల వారు మన దేశం వచ్చి చదువుకునే రోజులు వస్తాయి. ఉక్రెయిన్‌లో ఉన్న భారత విద్యార్థులను తెచ్చేందుకు కేంద్రం అనేక ప్రయత్నాలు చేస్తుంది.
జగనన్న పేరుతో కట్టే ఇళ్లకు మోడీ రూ. 32 వేల కోట్లు ఇస్తున్నారు.ఆ ఇళ్లకు స్థలం ఇచ్చామనే సాకుతో జగన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు.నరేగా కింద చంద్రబాబు హయాంలో రూ. 35 వేల కోట్లు ఇచ్చాం. జగన్ అధికారంలోకి వచ్చాక రూ. 37 వేల కోట్లు నిధులు నరేగా కింద కేటాయించారు.ఏపీ అభివృద్ధిని అన్ని విధాల కేంద్రం సహకరిస్తుంది.నితిన్ గడ్కరీ రూ. 3 లక్షల కోట్లు ఏపీకిచ్చారన్నారు సోము వీర్రాజు.
అంతా తానే చేసినట్టు జగన్ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏపీకి అమరావతే ఏకైక రాజధాని.. ఇందులో సందేహం లేదు.అందుకే అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులకు కేంద్రం వేల కోట్లు కేటాయించారు.భూములిచ్చిన రైతులకు లే అవుట్ వేసి ఇచ్చి ఉండాల్సింది.చంద్రబాబు ఆనాడు ఈ పని చేసి ఉంటే.. నేడు ఈ రాజధాని వివాదం వచ్చేదే కాదు. అనేక రాష్ట్రాల్లో సైలెంటుగా రాజధానులు నిర్మించుకున్నారు. ఇక్కడ గత, ప్రస్తుత పాలకుల చేతగానితనం కారణంగా రాజధాని వివాదం నెలకొంది.అమరావతి అభివృద్ధికి కేంద్రం సహకరించినా ఒక్కరూ చెప్పడం లేదన్నారు.
లగడపాటి రాజగోపాల్ పదేళ్లు ఎంపీగా ఉన్నా ఒక్క ఫ్లైఓవర్ నిర్మించ లేదు. మోడీ సారధ్యంలోని కేంద్రం సహకారంతో ఏపీ అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు అమరావతిలో బొక్కేసాడని బుక్కేశాడు జగన్. ఇప్పుడు ఆ రూ.55వేల కోట్లు ఈయనకి ఇస్తే ఈ సీఎం బొక్కేస్తాడన్నారు సోము వీర్రాజు.