ఆయనో మాజీ ఎమ్మెల్యే. అప్పట్లో మంత్రిగా కొన్నాళ్లున్నారు. అయినప్పటికీ ఏ పార్టీలోనూ పట్టుమని పదేళ్లపాటు కొనసాగలేని పరిస్థితి. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండాలా.. రిటైర్ అవ్వాలా అన్నట్టుగా ఉన్న పొలిటికల్ కెరియర్‌కు అనుచరుడి కామెంట్స్ తలనొప్పి తెచ్చాయా? గండం నుంచి గట్టెక్కేందుకు ఎవరి మద్దతు కూడగట్టాలో అర్థం కావడం లేదా? ఎవరా నాయకుడు? ఏమా కథ? స్థిరమైన ఆలోచన లేదని పాలేటిపై విమర్శపాలేటి రామారావు. చీరాల మాజీ ఎమ్మెల్యే. 1994, 1999లో చీరాల నుంచి టీడీపీ తరఫున రెండుసార్లు…
పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నేరవేరుస్తున్నారని కోవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకూమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త జిల్లాలను సీఎం జగన్ ఏర్పాటుచేశారన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్.పేరు పెట్టి చరిత్ర సృష్టించారన్నారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వాడుకున్నారే తప్ప ఆయన కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రయత్నం చేయలేదన్నారు. Read also: 14 నెలల్లో ప్లాంట్ ప్రారంభం ఓ మైలురాయి:…
ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీపై విముఖత తో ఉన్న ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఉద్యోగ సంఘాల నేతలు ఏకతాటిపై వచ్చి పీఆర్సీ సాధన కమిటీ గా ఏర్పడి సమ్మెకు సిద్ధమయ్యారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలను బుజ్జగించేందుకు ఏపీ ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించినప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం చర్చకు రాలేదు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వంప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఆర్‌సీ విషయంలో గత కొన్ని నెలలుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీఆర్‌సీని 23.29 శాతం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ అమలుకానున్నట్లు…
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ఉ ఓటేసి ప్రజలు తప్పు చేశారన్నారు. ప్రజలకు జగన్ చరిత్ర తెలిసి మరీ ఓటేశారని ఫైర్ అయ్యారు. జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి ప్రజలు ఓట్లేయడమంటే ప్రజలు చేసిన తప్పు కాక మరేమిటీ.. ? అంటూ సీరియస్ అయ్యారు. చంద్రబాబుకంటే ఎక్కువగా ఏదో మంచి చేస్తారని ప్రజలు ఓట్లేశారని.. ఇచ్చిన హామీలన్నీ చేసేస్తాడేమో.. మనం ఏమైపోతాం అని.. రాజకీయంగా ఉండగలమా..? లేదా..? అని నేనూ భయపడ్డానని వెల్లడించారు.…
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. దాదాపు గంటసేపు కేంద్ర మంత్రితో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి పలు జాతీయ రహదారులను మంజూరు చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకు ఏర్పాటు చేయాలనుకున్న జాతీయ రహదారికి సంబంధించిన డీపీఆర్ తయారీ అంశంపై చర్చించారు. విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, ఈ రహదారి నిర్మాణం ద్వారా విశాఖ పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గడ్…
మహిళలు ఆర్దికంగా , సామాజికంగా ముందుకు వెళ్ళేందుకు కృషిచేస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. వైసీపీలో లీడర్ ఒక్కరే అని. ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని, రెవెన్యూ మంత్రిగా ముప్పై లక్షల మందికి ఇల్లు ఇచ్చే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష టీడీపీ నిత్యం కుట్రలు కుతంత్రాలతో ముందుకెళుతోందన్నారు. ఏనాడూ సింగిల్ గా ఎలక్షన్ కి వెళ్ళి గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదని విమర్శించారు. పిల్లనిచ్చిన…
రాష్ట్రంలో పేదలకు కడుతున్న ఇళ్ళపై సీపీఐ రామకృష్ణ విమర్శలకు మంత్రి బొత్స కౌంటరిచ్చారు. విశాఖలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. పిచ్చుక గుళ్ళు లాంటి ఇళ్లు కడుతున్నారని విమర్శిస్తున్నారు. పేదలకు ఇళ్ళు ఇస్తే మీకెందుకు ఇబ్బంది అని ప్రశ్నించారు. హౌసింగ్ బోర్డు ప్రారంభమైన తర్వాత ఎప్పుడైనా ఇంతకంటే పెద్ద ఇళ్లు కట్టారా? సిద్దాంతాల గురించి మాట్లాడే బీజేపీ, కమ్యూనిస్టులు ఒకే వేదికపైకి వస్తారు. వీళ్ళ మధ్యలో టీడీపీ.దాని వెనుక తోకపార్టీ జనసేన నడుస్తున్నాయన్నారు.ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు వ్యాఖ్యలకు…
ఒకప్పుడు చంద్రబాబు అంటే ఎంతో అభిమానం.. కానీ ఆ తర్వాత ఆ అభిమానం చెదిరిపోయింది. వైసీపీలో చేరిన ఆ నేత కీలక పదవిని పొందారు. ఇప్పుడు చంద్రబాబుపై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలతో దాడి చేస్తున్నారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం. తాజాగా ఆయన చంద్రబాబుని చెడుగుడు ఆడేశారు. చంద్రబాబు ప్రజల విశ్వాసం కొల్పోయారని స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. మరో రెండు మూడు పర్యాయాలు జగనే ముఖ్యమంత్రి ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన…