రాష్ట్రంలో జగన్ దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రధాని మోడీ , హోంమంత్రి అమిత్ షా ల తో కుమ్మక్కై రాష్ట్రాన్ని అదానీ చేతిలో పెట్టారు. అదానీ భార్యకి రాజ్యసభ సీటు ఇచ్చే బదులు పార్టీలో చేర్చుకుంటే బాగుంటుంది. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ తో జగన్ అభాసు పాలయ్యారు. మంత్రి టెన్త్ పేపర్ లీక్ కాలేదని అంటాడు.. సీఎం ఏమో పేపర్ లీకు అయ్యిందంటాడు. జగన్ కి నిజంగా దమ్ముంటే…
ఏపీలో కడప జిల్లాలో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఏపీలో మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ కంటే ముందొస్తానని కోట్ల రూపాయల ప్రకటనల ద్వారా జగన్ ప్రచారం చేయించుకున్నారని.. సొంత కడప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెంపున్నెం ఎరుగని దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే గన్ ఎక్కడా? జగన్ ఎక్కడా? అని లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. Crime…
ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం వుంది. పార్టీలు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సి వుందని, అందుకు టీడీపీ నాయకత్వం వహిస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా త్యాగాలకు కూడా సిద్ధమేనంటూ చంద్రబాబు పొత్తు రాజకీయానికి తెరతీశారు. ఎన్నికలకు ముందే పొత్తుల కోసం రెడీ అవుతున్నాయి. వైసీపీ నేతలు అంచనా వేస్తున్నట్లుగా టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయటం ఖాయమనే సంకేతాలు వున్నాయి. పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లా పర్యటనలో…
టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. రుషికొండ వెళ్లకుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. గతంలో రుషికొండలోని హరిత రిసార్టును జగన్ సర్కారు కూల్చివేసింది. దీంతో ఆధునీకరణ పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ చంద్రబాబు రుషికొండ పర్యటనకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే తనను రుషికొండ వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. తాళ్లవలసలో బహిరంగ సభలో ఆయన జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు. 2029 నాటికి దేశంలో ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలని తాను ప్రణాళికలు…
కేసీఆర్ ప్రతి రోజూ ఉదయాన్నే సీఎం జగన్మోహన్ రెడ్డికి దండం పెడుతున్నారు. జగన్ వైఖరి వల్ల.. ఏపీలోని విద్యుత్ కోతల వల్ల ఏపీ నుంచి పరిశ్రమలు తెలంగాణకు తరలిపోతున్నాయన్నారు టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర. ఏపీలో ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోవాలని అనుకుంటున్నాయి.. ఇక కొత్త పరిశ్రమలు రావడానికే భయపడుతున్నాయి. ఏపీలోనే సోలార్ పవర్ రూ. 2కే లభ్యమవుతోంటే.. అదానీ దగ్గర నుంచి రూ. 4కు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరమేంటి.?ఎక్కడైనా పెద్దోడ్ని కొట్టి.. పేదోడికి పెడతారు..…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, రాజధాని నిర్మాణానికి గతంలో రుణాలిచ్చేందుకు అన్ని బ్యాంకుల ముందుకు వచ్చాయన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో బ్యాంకులు కూడా రుణాలిచ్చే పరిస్థితి లేదన్నారు. రాజధాని అభివృద్ధికి ప్రభుత్వం ఎందుకు సొంత నిధులు వెచ్చించడం లేదు.? ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసుకోవడానికి మాత్రం నిధులు ఉన్నాయా.?కొద్దిపాటి నిధులను వెచ్చిస్తే 78 శాతం పూర్తి చేసిన ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ,…
ఏపీలో ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్… పూటకో రేప్ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. ఇలాంటి ఘటనలతో బీహారును ఏపీ మించిపోయింది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.ఇవాళ ఓ వలసకూలీపై రేపల్లెలో అత్యాచారం జరిగింది. బతుకుదెరువు కోసం భర్త, పిల్లలతో వలసవెళ్లిన మహిళపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో ఏంచేసినా పోలీసులు ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఉన్మాదులు ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారన్నారు లోకేష్. గత నాలుగు రోజులుగా…
ఇవాళ ఢిల్లీలో కీలక న్యాయ సదస్సు జరగనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు,ముఖ్యమంత్రులు ఈ సదస్సులో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సుని ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ సదస్సుకి హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ నుంచి న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొంటారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొంటారు. సదస్సులో న్యాయస్థానాల్లో ఐటీ వినియోగం,…
రాష్ట్రాన్ని వైసీపీ దుష్ట చతుష్టయం పట్టి పీడిస్తోందని మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని జగన్ రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని చూస్తున్నారు.కేంద్రం పట్టించుకోకపోతే రాష్ట్రం కొలేటరల్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం.సీఎం జగనుది మోసకారి సంక్షేమం అని ప్రజలే భావిస్తున్నారు. రాష్ట్రం 7.76 లక్షల కోట్ల అప్పుల సుడిగుండంలో చిక్కుకుంది.సీఎం జగన్ దుర్వినియోగం చేసిన రుణాలను ఎవరు తిరిగి చెల్లిస్తారన్నదే ఇపుడు ప్రశ్న?కార్పొరేషన్లు గానీ,…