ఏ అంశంపైనా ప్రజా ఉద్యమాలు చేయాలన్నా ఎర్ర పార్టీల స్టైలే వేరు.. ప్రజా సమస్యలపై వినూత్న రీతిలో నిరసన చేపట్టడం వారికే చెల్లుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు.చెప్పులను నెత్తిపై పెట్టుకున్న వినూత్నంగా నిరసన తెలిపిన నారాయణ. చెప్పులను వేసుకోవడం కాదు తలపై పెట్టుకునే దుస్థితికి బీజేపీ తీసుకొచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పులపై జీఎస్టీ…
గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.వంగవీటిరాధా ప్రాణాలకు ముప్పు ఉందని అతడు చెప్పినప్పటి నుంచి రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. దీంతో ప్రభుత్వం ఇద్దరూ గన్‌మెన్‌లను పంపిచినప్పటికీ రాధా సున్నితంగా తిరస్కరించారు. తాజాగా ఈ అంశంపై టీడీపీ సీనియర్‌నేత కళా వెంకట్రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగవీటి రాధపై రెక్కీ నిర్వహించడం బాధాకరమని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు. ప్రభుత్వం మాటలు చెబుతోంది కానీ.. ఇప్పటివరకు…
ఏపీలో లిక్కర్ రాజకీయం నడుస్తోంది. తాము అధికారంలోకి వస్తే రూ.50కే మందు అందిస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన కామెంట్లు కాక పుట్టిస్తున్నాయి.ప్రజాగ్రహ సభ కాస్త బీజేపీపై ఆ్రగహానికి కారణం అయింది. ఏపీ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగు మీడియానే కాదు జాతీయ మీడియా సైతం ఆయన ప్రసంగానికి ప్రాధాన్యత ఇచ్చింది. సోము చేసిన వ్యాఖ్యలతో సభ ఉద్దేశం దారి మళ్ళిందంటున్నారు. తమ ప్రభుత్వం…
ఇవాళ ఏపీలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర సహ ఇన్ చార్జ్ సునీల్ ధియోధర్ ఏపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహిస్తోందని.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే…ఏపీలో మత మార్పిడి నిరోధక చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలకు గత ప్రభుత్వం చంద్రన్న పేరు పెట్టుకుంటే.. ప్రస్తుత ప్రభుత్వం జగనన్న పేరుతో అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి…
తిరుపతి రాజధాని రైతుల సభకు కన్నా ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్లిన బీజేపీ నేతలు ఈ సందర్భంగా బీజేపీ రాష్ర్ట మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కీలక సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల కోసం, ఏపీ భవిష్యత్ కోసం రైతులు భూములిచ్చారు. జగన్ సీఎం అయిన తర్వాత రైతులను మోసం చేశారు. మూర్ఖత్వపు ఆలోచనతో సీఎం మూడు రాజధానుల పేరుతో ముందుకెళ్లారు. సీఎం జగన్ ఇగోయిస్టు, శాడిస్టు, ఫ్యాక్షనిస్టు అంటూ మండిపడ్డారు.…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బిశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం ముగిసింది. గవర్నర్ దంపతుల ఆరోగ్యపరిస్థితిని ముఖ్యమంత్రి దంపతులు అడిగి తెలుసుకున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యలో బాధపడుతున్న గవర్నర్‌ను కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. కొన్ని రోజుల క్రితం బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా బారిన పడ్డారు. హైదారాబాద్‌లో ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్నారు. అయితే, పోస్ట్ కరోనా తరువాత మళ్లీ ఇబ్బందులు తలెత్తడంతో తిరిగి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో కొన్నిరోజులు ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్నాక ఏపీ వచ్చారు.…
టీడీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహమ్మద్ నిర్వహించే మదర్సాపై వక్ఫ్ బోర్డు అధికారులు దౌర్జన్యం రాజకీయ కక్ష సాధింపేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ కక్ష సాధింపునకు అడ్డు అదుపు లేకుండా పోతోందని, మదర్సాలపై దాడులకు పాల్పడుతూ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. వైసీపీ నేతల కక్షసాధింపు చర్యలకు గుడి, బడి అనే వ్యత్యాసం కూడా లేదా..? అని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు విద్యనందిస్తున్న మదర్సాను…
ఏపీలో ఇటీవల ఎన్నికైన 11 మంది కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం కార్యక్రమం మండలిలో జరుగుతోంది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మండలిలో బలం ఉందని ప్రతిపక్షం ఎలా వ్యవహారించిందో చూశామని, ఈ రోజు శుభదినమన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి జగన్ తప్పక న్యాయం చేస్తారనడానికి ఇదే నిదర్శనమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతి ఎన్నికల్లో విజయం సాధిస్తున్నామని, నేతల మధ్య విభేదాలున్నా కలిసి కట్టుగా పని చేసి, ప్రజల…
టీడీపీ నేత పట్టాభిరామ్ మరోసారి సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలంటూ గెజిట్ నోటిషికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పట్టాభి.. లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలని తీసుకువచ్చిన కొత్త నిబంధన మరో మోసమని ఆయన అన్నారు. పేదల ఙల్ల కోసం ఇప్పటికే 68 వేల ఎకరాలు సేకరించారన్నారు. ఇప్పుడు లేఅవుట్ల నుంచి అదనంగా వెయ్యి…