Israel: లెబనాన్‌పై ఇజ్రాయిల్ విరుచుకుపడింది. శుక్రవారం భారీగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ రాకెట్ యూనిట్ డిప్యూటీ హెడ్ మరణించినట్లు తెలిపింది.
పాకిస్తాన్ మూడు వైపుల నుంచి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ తన పశ్చిమ సరిహద్దులో భారతదేశంతో శత్రుత్వంతో ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబాన్ ఉత్తర సరిహద్దులో ఆయుధాలతో నిలబడి ఉంది. ఈశాన్య సరిహద్దులో ఇరాన్‌తో పాకిస్థాన్ శత్రుత్వం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
Iran: ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ ఇటీవల కాలంలో ఉరిశిక్షలను విధించడం ఎక్కువ చేసింది. ఇస్లామిక్ చట్టాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఇరాన్ మరణశిక్షలను ఎక్కువగా అమలు చేస్తుండటంపై హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది ఏకంగా 834 మందికి మరణశిక్ష విధించిందని, 2015 తర్వాత ఇదే అత్యధికమని హక్కుల సంఘాలు మంగళవారం తెలిపాయి. ఇటీవల సంవత్సరాల్లో ఇరాన్ ఉరిశిక్షల సంఖ్య 2022 నాటికి 43 శాతం పెరిగింది.
Israeli flight: ఇజ్రాయిల్‌కి వెళ్తున్న ఓ విమానాన్ని దారి మళ్లించి హైజాక్ చేసే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ ఎయిర్‌క్రాఫ్ట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌పై దాడి జరిగింది. దుండగులు విమానాన్ని దారి మళ్లించేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. హౌతీలు యాక్టివ్‌గా ఉన్న ఏరియాలో ఈ ఘటన జరిగింది.
Iran : ఇరాన్ ప్రధాన దక్షిణ-ఉత్తర గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్‌లో బుధవారం రెండు పేలుళ్లు సంభవించాయని ఇరాన్ చమురు మంత్రి ప్రకటించారు. కొన్ని ప్రావిన్సులలోని పరిశ్రమలు, కార్యాలయాలకు ఈ సంఘటన గ్యాస్ కోతలకు కారణమైందన్న వార్తలను రాష్ట్ర మీడియా నివేదించింది వీటిని అధికారులు ఖండించారు.
ముగ్గురు సైనికుల మరణం తర్వాత ఇరాన్ అనుకూల మిలీషియాపై అమెరికా రక్తపాత దాడులను కొనసాగిస్తోంది. తాజా దాడిలో, ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో డ్రోన్ దాడిలో కారులో ప్రయాణిస్తున్న ఇరాన్ అనుకూల ఖతైబ్ హిజ్బుల్లా టాప్ కమాండర్‌ను అమెరికా చంపేసింది.
Indian Navy: భారత నేవీ దెబ్బకు మరోసారి సముద్ర దొంగల ప్రయత్నం విఫలమైంది. సోమాలియా తూర్పు తీరం వెంబడి మరో పైరసీ ప్రయత్నాన్ని అడ్డుకుంది. జనవరి 31న ఎంవీ ఒమారీ అనే ఇరానియన్ ఫ్లాగ్డ్ కలిగి ఉన్న ఫిషింగ్ నౌకపై ఏడుగురు సముద్ర దొంగల దాడిని నిలువరించి పాకిస్తాన్, ఇరాన్ సిబ్బంది రక్షించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
Iran: ఇరాన్ తన ప్రధాన శత్రువు ఇజ్రాయిల్ కోసం గూఢచర్యానికి పాల్పడుతున్న నలుగురుకి ఉరిశిక్ష విధించింది. దోషులుగా తేలడంతో వారిని సోమవారం తెల్లవారుజామున ఉరితీసినట్లు టెహ్రాన్ న్యాయవ్యవస్థ తెలిపింది.
Iran-Pakistan: ఇరాన్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ ఇటీవల పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్సుపై వైమానిక దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్ లోని సిస్తాన్ బలూచిస్తాన్‌పై పాక్ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉంటే ఇటీవల ఇరాన్ లోని పాక్ సరిహద్దు ప్రాంతాల్లో 9 మంది పాకిస్తాన్ జాతీయులను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.