Houthi Rebels: హిందూ మహాసముద్రంలో నాలుగు నౌకలపై హౌతీ రెబల్స్ దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Houthi Rebels: ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరిగినప్పటి నుంచి యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారు. మరోవైపు హిందూ మహా సముద్రంలో నౌకలపై హౌతీ రెబల్స్ దాడులు పెంచారు. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న దేశాలకు చెందిన నౌకలపై ఈ దాడులు కొనసాగుతున్నాయి. హిందూ మహా సముద్రంలో డ్రోన్ దాడులను ప్రారంభించామని.. MSC ఓరియన్ కంటైనర్ షిప్‌ను లక్ష్యంగా చేసుకున్నామని యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు తెలిపారు. LSEG డేటా ప్రకారం.. పోర్చుగీస్- ఫ్లాగ్ ఉన్న MSC ఓరియన్ పోర్చుగల్, ఒమన్ మధ్య పని చేస్తోంది.
Read Also: Karnataka: శ్రీనివాస్ ప్రసాద్ మృతికి సంతాపంగా మంగళవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ఇరాన్-మద్దతుగల హౌతీ మిలిటెంట్లు నవంబర్ నుంచి ఎర్ర సముద్రం, బాబ్ అల్- మందాబ్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో పదేపదే డ్రోన్, క్షిపణి దాడులను కొనసాగిస్తున్నాయి. దక్షిణాఫ్రికా చుట్టూ సుదీర్ఘమైన ప్రయాణాలకు నౌకలను నిరోధిస్తున్నారు. ఈ దాడుల వల్ల ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం తీవ్రతరం అవుతుందనే భయాలను కూడా పెంచుతుంది. అయితే, నౌకలపై దాడులకు ప్రతిస్పందనగా, అమెరికా, బ్రిటన్ హౌతీ రెబల్స్ స్థానాలపై దాడి చేశాయి. హిందూ మహాసముద్రంలో ఉన్న భారత నావికాదళం ఏప్రిల్ 26వ తేదీన పనామా జెండాతో కూడిన ముడి చమురు ట్యాంకర్‌కు సహాయం చేసిందని ఆదివారం వార్తలు వచ్చాయి. హౌతీ తిరుగుబాటుదారులు ఈ ట్యాంకర్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు సమాచారం. కాగా, ఓడలో 22 మంది భారతీయులతో సహా మొత్తం 30 మంది సిబ్బంది ఉన్నారు.
తాజావార్తలు
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!