Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్‌లో ఓ హెలికాప్టర్ అనుమానాస్పద స్థితిలో కుప్పకూలింది. హెలికాప్టర్‌కి ఏం జరిగింది, అందులో ఎవరు ఉన్నారు అనేదానిపై వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదం ఇరాన్ తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో జరిగింది. అధ్యక్షుడు ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్ కూలిన ప్రాంతానికి రెస్క్యూ సిబ్బంది వెళ్లిందని ఆ దేశ టెలివిజన్ ఆదివారం నివేదించింది.
Read Also: Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్‌లోని హెలికాప్టర్ క్రాష్..
కొన్ని నివేదికలు ప్రకారం.. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్ అయిందని చెబుతున్నాయి. ఇరాన్న రాజధాని టెహ్రాన్‌కి వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో అజర్‌బైజాన్ దేశం సరిహద్దులో ఉన్న జోల్ఫా అనే నగరానికి సమీపంలో ఈ సంఘటన జరిగిందని స్టేట్ టీవీ తెలిపింది. రెస్క్యూ చేయడానికి సిబ్బంది క్రాష్ సైట్‌కి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, అయితే ఆ ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల కారణంగా ఆటంకం ఏర్పడింది. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి డ్యామ్‌ను ప్రారంభించేందుకు రైసీ ఆదివారం తెల్లవారుజామున అజర్‌బైజాన్‌లో ఉన్నారు. ఆరాస్ నదిపై రెండు దేశాలు కలిసి మూడో ఆనకట్టను నిర్మించాయి.
BREAKING: Rescuers in Iran are trying to reach a helicopter involved in “an incident” while traveling with an entourage including President Ebrahim Raisi, state television reported. https://t.co/Fkm5PwqK0c
— The Associated Press (@AP) May 19, 2024
BREAKING NEWS: Iranian state TV reports rescuers are trying to reach the site of the helicopter “incident” while carrying President Raisi. #israel #iran #helicopter #breakingnews #raisi #middleeast pic.twitter.com/zEly3owCYh
— ILTV Israel News (@ILTVNews) May 19, 2024