Cyber Attack In Iran: పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణంతో ప్రపంచమంతా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఈ సమయంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌లో ఈరోజు (శనివారం) భారీ స్థాయిలో సైబర్ దాడులు జరిగినట్లు తేలింది. దాంతో సర్కార్ లోని మూడు బ్రాంచ్‌ల (న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖలు) సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే, అణుస్థావరాలే టార్గెట్ గా ఈ దాడులు జరిగాయి. దీని వల్ల సమాచారం చోరీకి గురైందని ఇరాన్ సైబర్‌స్పేస్ విభాగంలో పని చేసిన మాజీ సెక్రటరీ ఇరాన్ మీడియాకు తెలిపారు. మా అణు స్థావరాలు సైబర్ దాడులకు గురయ్యాయని వెల్లడించారు. అలాగే, ఇంధనం సరఫరా చేసే నెట్‌వర్క్‌లు, మున్సిపల్, ట్రాన్స్‌పోర్టు నెట్‌వర్కులపై సైబర్ దాడులు చేసినట్లు చెప్పుకొచ్చారు.
Read Also: Health Tips : డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? మీకు తెలియకపోతే ఈ లక్షణాలు తెలుసుకోండి…!
ఇక, హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న టైంలో ఇరాన్ సైతం రంగంలోకి దిగింది. క్షిపణి దాడులతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్ష దాడులకి దిగింది. ఈనెల మొదటి రోజున తమపై జరిగిన దాడికి ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సర్కార్ రగిలిపోతోంది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ఇరాన్‌కు చెందిన చమురు, అణుస్థావరాలు లక్ష్యంగా దాడులు చేస్తుందా..? అనే ఆందోళనల మధ్య ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని అమెరికా అధ్యక్షుడు నెతన్యాహుకు సూచనలు చేశారు. ఈ తరుణంలోనే సైబర్ దాడులు జరగడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. మరోవైపు, అమెరికా కూడా ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రో కెమికల్ రంగాలపై ఆంక్షలను విధించింది. ఇరాన్ నిధులు సమకూర్చుకునే సామర్ధ్యాన్ని దెబ్బ తీసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.