UK vs Russia: గత రెండేళ్లుగా రష్యా- ఉక్రెయిన్‌ల యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పలు సంచలన విషయాలు తెలిపింది. ఉక్రెయిన్‌కు సపోర్టుగా నిలిచిన బ్రిటన్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు రష్యా ప్రయత్నిస్తుందని ఎమ్‌ఐ5 ఏజెన్సీ ఆరోపించింది. అయితే, యూకేకు చెందిన ఎమ్‌ఐ5 తన వార్షిక నివేదికలో దీనికి సంబంధించిన విషయాలను బయట పెట్టింది. ఈ సందర్భంగా ఎమ్‌ఐ5 డైరెక్టర్ జనరల్ కెన్ మెక్ కలమ్ మాట్లాడుతూ.. రష్యా- ఉక్రెయిన్‌ల యుద్ధం స్టార్టింగ్ నుంచి బ్రిటన్ పౌరులకు, నివాసితులకు వార్నింగ్స్ వచ్చాయన్నారు. ఇరాన్ మద్దతుతో జరిగిన 20 కుట్రలను తాము భగ్నం చేసినట్లు చెప్పుకొచ్చారు. అలాగే, 2017 మార్చి నుంచి ఎమ్‌ఐ5, యూకే భద్రతా అధికారులు సంయుక్తంగా దాదాపు 43 కుట్రలను తిప్పికొట్టినట్లు డైరెక్టర్ జనరల్ కెన్ మెక్ కలమ్ తెలిపారు.
Read Also: Gutha Sukender Reddy: మూసీపై డీపీఆర్ కాకముందే ఆరోపణలు.. ఇది సరికాదు..
ఇక, రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బ్రిటన్ లో ప్రమాదకరమైన విధ్వంసాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఎమ్‌ఐ5 డైరెక్టర్ జనరల్ కెన్ మెక్ కలమ్ ఆరోపించారు. ఇందులోభాగంగా రష్యా- ఇరాన్ దేశాలకు చెందిన పలువురు నేరస్థులను, ప్రైవేటు ఇంటెలిజెన్స్ అధికారుల నియామకాలను చేపడుతుందన్నారు. 18 ఏళ్ల లోపు యువతలో 13 శాతం మంది ఈ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ సంఖ్య గత మూడేళ్లలో మరింత పెరిగిపోయిందని ఆందోళన ఆయన వ్యక్తం చేశారు. చాలా మంది యువకులను ఆన్‌లైన్ తీవ్రవాదంలోకి లాగుతున్న పేర్కొన్నారు. అలాగే, యూకేలో తీవ్రవాద కుట్రలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.. ఐదింట మూడో వంతు అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని కెన్ మెక్ కలమ్ హెచ్చరించారు.