Iran Nuclear Tests: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ఇరాన్ మరింత పెంచుతుంది. అందులో భాగంగా తాజాగా అణు పరీక్షలు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 5వ తేదీన శనివారం రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగాల్లో దాదాపుగా ఒకే టైంలో సంభవించిన భూకంపం ఈ అనుమానాలకు దారి తీసింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:45 సమయంలో ఇరాన్‌లోని అరదాన్ నగర సమీపంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదు అయింది.
Read Also: CM Chandrababu Delhi Tour: హస్తినలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. నేడు కీలక భేటీలు
అయితే, అక్కడికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో కూడా ప్రకంపనలు సంభవించినట్లు అమెరికా భౌతిక సర్వే విభాగం వెల్లడించింది. తర్వాత కొద్ది నిమిషాలకే ఇజ్రాయెల్‌లోనూ భూ ప్రకంపనలు కనిపించాయని పేర్కొనింది. ఇది భూకంపం కాదని, ఖచ్చితంగా భూగర్భ అణు పరీక్షల చేసినట్లు విశ్లేషణలు అంటున్నారు. ఈ భూకంపం సంభవించింది అణు ప్లాంట్‌కు అతి సమీపంలోనే అని వస్తున్న వార్తలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది. భూకంప కేంద్రం ఉపరితలానికి కేవలం 10 కిలో మీటర్ల లోపల ఉండటం చూస్తుంటే ఇరాన్ భూగర్భ అణు పరీక్షలు చేసి ఉంటుందని అనుమానం కలుగుతుంది. ఇజ్రాయెల్ దూకుడుకు బ్రేక్ వేసేందుకే ఇరాన్ న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నట్లు సమాచారం.