Iran-Israel: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై మరోసారి దాడికి ఇరాన్ రెడీ అవుతున్నట్లు ఓ నివేదిక తెలిపింది. ఇరాక్ భూభాగం నుంచి ఇరాన్ ఈ దాడులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉండడంతో అంతకు ముందే ఈ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లు వినియోగించేందుకు టెహ్రాన్ చూస్తున్నట్లు యాక్సియోస్ రిపోర్టు పేర్కొనింది. ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల మిలిటెంట్ల ద్వారా ఈ దాడిని చేపట్టేందుకు ఆ దేశం రెడీ అవుతున్నట్లు సదరు నివేదిక వెల్లడించింది. అందువల్ల ఇజ్రాయెల్ మరోసారి ప్రతీకార చర్యలు చేపట్టకుండా ఉండే ఛాన్స్ ఉంటుందని ఇరాన్ భావిస్తుంది.
Read Also: UnstoppableS4 : దుల్కర్ చూపిన 12వ తరగతి ప్రేమ కథ..
కాగా, హమాస్ అధినేత ఇస్మాయెల్ హనీయా, హెజ్‌బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన నిల్పోరూషన్ మరణానికి ప్రతీకారంగా నెల రోజుల క్రితం ఇజ్రాయెల్‌పై భీకరంగా దాడులు చేసింది. 200 మిస్సైళ్లతో దేశవ్యాప్తంగా దాడి చేయడంతో ఇజ్రాయెల్ ప్రజలు బంకర్లలోకి వెళ్లిపోయారు. దీంతో ప్రతీకారం తీర్చుకుంటాని చెప్పిన ఇజ్రాయెల్.. అన్నట్టుగానే ఇటీవల టెహ్రాన్‌పై దాదాపు 200 యుద్ధ విమానాలతో దాడి చేసింది. డ్రోన్ ఫ్యాక్టరీలు, బాలిస్టిక్ క్షిపణి తయారీ, ప్రయోగ కేంద్రాలపై మెరుపు దాడులు జరిపింది. దీంతో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్తలు పెరిగాయి. ఈ దాడికి ప్రతీకారం తప్పదని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అందులో భాగంగా దాడి ఘటన తమ దేశంపైకి రాకుండా ఉండేలా ఇరాక్ నుంచే ఇరాన్ దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తుందని నిఘావర్గాలు తెలిపాయి.