Hezbollah Deputy: ప్రాణ భయంతో దెబ్బకి ఇరాన్ పారిపోయిన హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్..
- ప్రాణ భయంతో ఇరాన్ పారిపోయిన హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్..
- అక్టోబర్ 5న నయీమ్ ఖాసిమ్ బీరుట్‌ను వీడిచినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడి..
- ఇజ్రాయెల్ ప్రధాన టార్గెట్గా హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్ ఖాసిమ్ ఉండటంతోనే ఇరాన్ జంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hezbollah Deputy: లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం భారీ స్థాయిలో దాడులు కొనసాగిస్తుంది. హెజ్‌బొల్లా రాజకీయ, సైనిక కేంద్రాలే టార్గెటుగా వరుస దాడులు చేస్తూ వస్తుంది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా సహా పలువురు కీలక నేతలను చంపేసింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్ గా ఉన్న నయీమ్ ఖాసిమ్ ప్రాణ భయంతో లెబనాన్‌ను వదిలి పెట్టినట్లు సమాచారం. డిప్యూటీ చీఫ్ ఖాసిమ్ ఇరాన్‌కు పారిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది.
Read Also: Allu Arjun : హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్..
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
అయితే, హిబ్ జొల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ అక్టోబర్ 5వ తేదీనే బీరుట్‌ను వీడిచి పెట్టినట్లు ఇరాన్ వర్గాలను ఊటంకిస్తూ యూఏఈకి చెందిన ఎరెమ్ న్యూస్ ఓ కథనం ప్రసారం చేసింది. లెబనాన్, సిరియా పర్యటనకు వెళ్లిన ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరగచి విమానంలోనే ఆయన బీరుట్ నుంచి ఇరాన్‌కు వెళ్లినట్లు తెలుస్తుంది. ఇజ్రాయెల్ ఆయనను హత్య చేసే ఛాన్స్ ఉండటంతో ఇస్లామిక్ రిపబ్లిక్ నేతల హెచ్చరికలతోనే నయీమ్ ఖాసిమ్ లెబనాన్‌ను వదిలేసినట్లు వెల్లడించింది.
Read Also: Pawan Kalyan: హడావుడిగా గుర్ల టూర్ ముగించుకున్న డిప్యూటీ సీఎం పవన్!
ఇక, సెప్టెంబర్ 27న ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా చనిపోయారు. నస్రల్లా మృతి తర్వాత నయీమ్ ఖాసిమ్ మూడుసార్లు మాట్లాడారు. అందులో ఒకటి బీరుట్ నుంచి కాగా, మిగతా రెండు టెహ్రాన్ నుంచి.. నస్రల్లా మరణం తర్వాత ఇజ్రాయెల్ ముఖ్య టార్గెట్‌గా నయీమ్ ఉన్నాడు. దీంతో ఆయన ప్రాణ భయంతో లెబనాన్ నుంచి ఇరాన్ పారిపోయినట్లు సమాచారం. మిలిటెంట్ గ్రూపుల్లో ఒకటైన షియా రాజకీయ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో నయీమ్ ఖాసిమ్ ఒకరుగా ఉన్నారు. ఇజ్రాయెల్ టార్గెట్ చేసిందనే సమాచారంతో నస్రల్లా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన తర్వాత సభలు, ఇంటర్వ్యూలతో పాటు ఇతర బహిరంగ కార్యక్రమాల్లో హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ ఖాసిమ్ పాల్గొన్నారు. హసన్ నస్రల్లా మరణించిన తర్వాత హెజ్‌బొల్లా చీఫ్ బాధ్యతలు ఖాసిమ్ కు అప్పగించినట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!