ఉత్తర గాజాలో జరిగిన పేలుడులో అత్యంత సీనియర్ ఇజ్రాయెల్ ఆర్మీ కమాండర్లలో ఒకరైన కల్నల్ అహ్సన్ దక్సా మరణించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. జబాలియా ప్రాంతంలో అహ్సన్ దక్సాను పేలుడు పదార్ధం తాకడంతో ఈ సంఘటన జరిగిందని సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. ఈ ఘటనలో మరో బెటాలియన్ కమాండర్‌తో పాటు మరో ఇద్దరు గాయపడ్డారని ఆయన తెలిపారు. ఉత్తర గాజాలో హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దక్సా మరియు ఇతర అధికారులు తమ పరిసరాలను సర్వే చేస్తుండగా పేలుడు పరికరం పేలింది.
ఇది కూడా చదవండి: Maharashtra Elections: సీట్ల పంపకాలపై కుదిరిన డీల్.. ఇండియా కూటమిలో ఎవరికెన్ని సీట్లంటే..!
కల్నల్ దక్సా మరణాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ధృవీకరించారు. హమాస్ ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు మరణించినట్లు చెప్పారు. దక్సా మరణంపై ఇరాన్ ఎక్స్ వేదికగా స్పందించింది. దక్సా సీనియర్ టెర్రరిస్టు అని సంభోదించింది. ఉత్తర గాజాలో మారణహోమం చేస్తున్నప్పుడు మా పాలస్తీనా సోదరుచే చంపబడినట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Israel: గాజాలో అపశృతి.. పేలుడు పదార్థం తాకి ఇజ్రాయెల్ టాప్ కమాండర్ మృతి