అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం ఇరాన్‌పై భారీ ఎఫెక్ట్ పడింది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. దీంతో ఇరాన్ కరెన్సీ రియాల్ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. ఇరాన్ కరెన్సీ రియాల్ బుధవారం యూఎస్ డాలర్‌తో పోలిస్తే 7,03,000 ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో ఒక్కసారి ఢమాల్ అయింది. 2015లో ఒక డాలర్‌కు 32,000 ఉండేది. తాజాగా అమెరికాకు ట్రంప్ తిరిగి అధ్యక్షుడు కావడంతోనే ఇరానీ కరెన్సీ రియాల్ ఒక్కసారిగా పడిపోయిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: VenkyAnil3 : అరకులోయలో విక్టరీ వెంకటేష్ యాక్షన్..
మే నెలలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆయన స్థానంలో మసౌద్ పెజెష్కియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రమాణస్వీకారం చేసినప్పుడు కరెన్సీ డాలర్‌కు 584,000కి పడిపోయింది. తాజాగా ట్రంప్ విజయంతో కరెన్సీ విలువ మరింత పతనమైపోయింది.
కరెన్సీ పతనంపై ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫతేమెహ్ మొహజెరానీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవడంతోనే కరెన్సీ పతనం అయినట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ట్రంప్ ఎన్నికకు.. ఇరాన్‌కు సంబంధం లేదన్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కొన్నేళ్లుగా మందగమనాన్ని ఎదుర్కొంటోందని చెప్పారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: మంత్రులకు మరోసారి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!
గత కొద్ది రోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్.. తన మిత్రదేశాలతో సహా యుద్ధంలో చిక్కుకుంది. హమాస్, హిజ్బుల్లా, యెమెన్ యుద్ధాల్లో చిక్కుకున్నాయి. వాటికి మద్దతుగా నిలిచిన ఇరాన్ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇటీవల ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. రక్షణ వ్యవస్థకు సంబంధించిన వాటిని పేల్చేసింది. దీంతో ఇరాన్.. ఇజ్రాయెల్, అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. అమెరికా ఎన్నికలలోపు దాడులు చేస్తామని హెచ్చరించింది. కానీ అలాంటి దాడులైతే చేయలేదు. ప్రస్తుతం అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఘనవిజయం సాధించారు. 270 మార్క్ క్రాస్ చేసి.. 276 సీట్లు సాధించి భారీ విక్టరీ నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Secunderabad: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.20కోట్లతో ఉడాయించిన దంపతులు