US F-15 Fighter Jets: మిడిల్ ఈస్ట్‌కు అమెరికా ఫైటర్ జెట్ విమానాలు..!
- పశ్చిమాసియాలో యుద్ధ విమానాలను మోహరిస్తున్న అమెరికా..
- యూఎస్ ఫైటింగ్ స్క్వాడ్రన్‌కు చెందిన ఎఫ్-15 స్ట్రైక్ ఈగిల్స్‌ను మిడిల్ ఈస్ట్‌కు తరలింపు..
- గల్ఫ్‌లోని సైనిక స్థావరాలకు చేరిన అమెరికా బీ-52 బాంబర్లు.. బాలిస్టిక్ క్షిపణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US F-15 Fighter Jets: పశ్చిమాసియాలో ఉద్రిక్త నేపథ్యంలో అమెరికా మోహరింపులు వేగవంతమయ్యాయి. తాజాగా ఎఫ్-15 ఫైటర్‌జెట్‌లను అక్కడికి తరలించినట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది. ఇరాన్ దుందుడుకు చర్యలను కట్టడి చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనింది. ఈ రోజు (శుక్రవారం) అమెరికా వాయుసేన 492వ ఫైటింగ్ స్క్వాడ్రన్‌కు చెందిన ఎఫ్-15 స్ట్రైక్ ఈగిల్స్‌ను మిడిల్ ఈస్ట్‌కు తరలించామని వెల్లడించారు. ఇవి ఇప్పటికే అక్కడి సెంట్రల్ కమాండ్‌కు చేరుకొన్నాయని ఆ దేశ సైన్యం సోషల్ మీడియాలో తెలిపింది. ఇప్పటికే అమెరికా బీ-52 బాంబర్లు కూడా గల్ఫ్‌లోని సైనిక స్థావరాలకు చేరిపోయాయని చెప్పుకొచ్చారు. వీటికి అండగా ట్యాంకర్ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, డెస్ట్రాయర్స్‌ను తరలించామని యూఎస్ వెల్లడించింది.
Read Also: Varun Dhawan: సిటడెల్‌లో సెమీ న్యూడ్ సీన్.. నెటిజన్‌కు ఫన్నీ రిప్లై ఇచ్చిన హీరో!
Also Read
కాగా, అంతకు ముందే థాడ్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా అక్కడ మోహరించింది. ఇరాన్, దాని రహస్య ముఠాలు అమెరికా మిలటరీ లేదా ప్రయోజనాలను దెబ్బ తీయాలని ట్రై చేస్తే అడ్డుకొని మా వారిని రక్షించుకోవడానికే అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇటీవల వాషింగ్టన్ వార్నింగ్ జారీ చేసింది. ఇరాన్ అతి త్వరలో తమపై దాడి చేస్తుందని ఇజ్రాయెల్‌కు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థలు నివేదికలు ఇచ్చింది. ఇరాక్ వైపు నుంచి జరగొచ్చని సమాచారం అందించింది. దీంతో అలర్టైన అమెరికా ఇరాక్ భూభాగం నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు జరిగిన తర్వాత ఎదురైయ్యే పరిణామాలను బాగ్దాద్ అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ ఆరోపణలను మాత్రం ఇరాక్ తప్పుబట్టింది. అక్టోబర్ 1న ఇరాన్ దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరోవైపు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారు. ఇరాన్ ఇప్పుడు ఏమైనా దుందుడుకు చర్యలు చేపడితే.. అమెరికా స్పందన ఎలా ఉంటుందన్నది ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?