Iran: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ట్రంప్ నిర్ణయం కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది
- పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ట్రంప్ నిర్ణయం కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది
- ఇరాన్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రెజా అరేఫ్ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆపేందుకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని ప్రపంచమంతా ఎదురుచూస్తోందని ఇరాన్ పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్ మాట్లాడినప్పుడు కూడా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి కూడా ముగింపు ఉంటుందని పేర్కొన్నారు. యుద్ధం ముగింపు వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రెజా అరేఫ్ స్పందించారు.
ఇది కూడా చదవండి: AI Adoption: ప్రపంచంతో పోలిస్తే, AIని తెగవాడుతున్న ఇండియా….
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
గాజా, లెబనాన్‌లో యుద్ధాలను ఆపడానికి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ఏం నిర్ణయం తీసుకుంటారని ప్రపంచం వేచి చూస్తోందని మొహమ్మద్ రెజా అరేఫ్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్.. గాజా, లెబనాన్‌పై ఐడీఎఫ్ మారణహోమం సృష్టించిందని ఆరోపించారు. ఇజ్రాయెల్ మారణహోమాన్ని వ్యవస్థీకృత ఉగ్రవాదంగా పేర్కొన్నారు. గాజా, లెబనాన్‌లోని అమాయక ప్రజలపై యుద్ధాన్ని తక్షణమే ఆపడానికి ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Weight Loss: జిమ్, వ్యాయమం చేయకుండా బరువు తగ్గొచ్చు.. ఎలాగో తెలుసా..!
అక్టోబర్ 7, 2023లో హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి పౌరులను బందీలుగా తీసుకెళ్లిపోయారు. దీంతో ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. ఆనాటి నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై యుద్ధం చేసింది. దాదాపుగా గాజాను ధ్వంసం చేసింది. ఇక హమాస్ అగ్ర నేతలందరినీ హతం చేసింది. హమాస్ మద్దతు తెలిపిన హిజ్బుల్లా అంతుకూడా చూసింది. హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను అంతమొందించింది. ఇక ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ మాజీ నాయకుడు ఇస్మాయిల్ హనియాను తుదిముట్టించింది. అనంతరం ఎన్నికైన హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను కూడా చంపేసింది. ఇలా నాయకులను ఐడీఎఫ్ లేపేసింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. జనవరి 20, 2025న అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బాధ్యతలు స్వీకరించాక.. ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!