Israeli Airstrikes Beirut: బీరుట్ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..
- మరోసారి బీరుట్ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..
- హెజ్‌బొల్లా ముష్కరులు ఆ ప్రాంతాల్లో ఉన్నారనే సమాచారంతో దాడి చేశాం: ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israeli Airstrikes Beirut: లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాలపై భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్. లెబనాన్‌లోని ఏకైక అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు సమీపంలోనూ దాడులకు పాల్పడింది. హెజ్‌బొల్లా ముష్కరులు ఆయా ప్రాంతాల్లో నక్కి ఉన్నారంటూ తమకు సమాచారం అందిందని ఇజ్రాయెల్ సైన్యం చెప్పుకొచ్చింది. ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన తర్వాతే దాడులకు దిగినట్లు పేర్కొనింది. అయితే, ఈ దాడుల నష్ట తీవ్రత ఇంకా వెల్లడించలేదు. మరోవైపు- ఇజ్రాయెల్ దూకుడును తగ్గించుకుంటే.. కాల్పుల విరమణపై ఆ దేశంతో చర్చలు జరిపేందుకు తాము రెడీగా ఉన్నట్లు హెజ్‌బొల్లా నేత నయీం ఖాసిం బుధవారం చెప్పుకొచ్చారు.
Read Also: SA vs IND: నేడే దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. భారత జట్టులో ఎవరుంటారు?
Also Read
ఇక, గాజాలో తమ సైనిక ఆపరేషన్‌ను మరింత విస్తృతం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా వాయవ్య గాజా పట్టణమైన బీట్ లహియాలో భూతల దాడులు చేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి యుద్ధం స్టార్టింగ్ లోనే బాంబు దాడులతో ఈ పట్టణంలో ఇజ్రాయెల్ నానా బీభత్సం సృష్టించింది. ప్రస్తుతం హమాస్ ముష్కరులు మళ్లీ అక్కడ తలదాచుకుంటున్నట్లు సమాచారం అందింది.. అందుకే భూతల దాడులకు దిగుతున్నామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
Read Also: CM Revanth Reddy: నేడు సీఎం పుట్టినరోజు.. యాదాద్రిని దర్శించుకోనున్న రేవంత్ రెడ్డి.
కాగా, అమెరికా దిగ్గజ సంస్థ బోయింగ్ నుంచి 25 ఎఫ్-15 యుద్ధ విమానాలను కొనుగోలుకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నామని ఇజ్రాయెల్ తెలిపింది. దాడులకు పాల్పడే పాలస్తీనా ప్రజల కుటుంబ సభ్యులను తమ దేశం నుంచి బహిష్కరించేలా కొత్త చట్టాన్ని గురువారం నాడు ఇజ్రాయెల్ తీసుకొచ్చింది. సంబంధిత బిల్లును ఆ దేశ పార్లమెంటులో 61-41 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఇజ్రాయెల్‌తో పాటు తూర్పు జెరూసలెంలోని పాలస్తీనా పౌరులకు ఈ చట్టం వర్తించనుంది. బహిష్కరణ వేటు పడ్డవారిని గాజా లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లగొట్టనున్నారు.
తాజావార్తలు
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!