బతుకుదెరువు కోసం ఇరాన్ వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమయ్యారు. దీంతో వారి జాడ తెలియక కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. తమ బిడ్డల జాడ గుర్తించాలని ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని కుటుంబ సభ్యులు సంప్రదించారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు గాజాపై విరుచుకుపడుతున్న ఐడీఎఫ్ దళాలు.. తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ దళాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
Iran: ఇరాన్ దక్షిణ ప్రాంతంలో బందర్ అబ్బాస్ లోని షాహిద్ రాజీ పోర్టులో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 516 మంది గాయపడినట్లు ఆ దేశపు స్టేట్ మీడియా నివేదించింది. ఒమన్‌లో ఇరాన్, అమెరికా మధ్య మూడో రౌండ్ అణు చర్చలు ప్రారంభమైన సమయంలోనే ఈ పేలుడు సంభవించడం గమనార్హం. అయితే, పేలుడుకు సంబంధించిన ఖచ్చితమైన కారణాలను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. రాజీ ఓడరేవులోని ఒక కంటైనర్‌లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
Iran: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే భారత్ పాక్‌కి వ్యతిరేకంగా దౌత్య యుద్ధాన్ని మొదలుపెట్టింది. ‘‘సింధు జల ఒప్పందం’’ని రద్దు చేసింది. సింధు, దాని ఉపనదుల నుంచి ఒక్క చుక్క నీరు పాక్‌కి వెళ్లకుండా ప్రణాళికలు రచిస్తోంది.
ఇరాన్‌ను మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అణ్వాయుధాల ప్రస్తావన ఇరాన్ మరిచిపోవాలని.. లేదంటే అణు స్థావరాలపై మిలిటరీ చర్య ఉంటుందని హెచ్చరించారు. న్యూక్లియర్ ఒప్పందం చాలా దగ్గరకు వచ్చినప్పటికీ ఇరాన్ కావాలనే తాత్సారం చేస్తోందని ఆరోపించారు.
ఇరాన్‌కి మరోసారి అణు ఒప్పందం విషయంలో తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకుంటే మంచిది అని.. లేదంటే పెద్ద ప్రమాదంలో పడతారని ట్రంప్ హెచ్చరించారు. సోమవారం ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భేటీ అయ్యారు.
ప్రపంచంలోనే అత్యంత అధునాతన ప్రమాదకరమైన అమెరికాకు చెందిన బీ-2 బాంబర్ విమానాలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో మోహరించాయి. ప్రస్తుతం ఇలాంటివి అమెరికా దగ్గర 20 ఉన్నాయి. వీటిలో ఆరు విమానాలను ఇండో-పసిఫిక్‌కు తరలించింది.
ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం ముసురుతోంది. తమతో అణు ఒప్పందం చేసుకోకపోతే భయంకరమైన బాంబు దాడులు జరుగుతాయని ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు.
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ క్షణంలోనైనా ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులకు దిగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాతో అణు ఒప్పందంతో చేసుకోకపోతే.. తీవ్రమైన బాంబు దాడులు జరగొచ్చని ఆదివారం ట్రంప్.. ఇరాన్‌ను హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నిన్నామొన్నటి దాకా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై గరం గరంగా ఉన్న ట్రంప్.. ఇప్పుడు డైరెక్షన్ మారింది. తాజాగా పుతిన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.