Israel-Iran War: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు
- ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు
- ఖమేనీ ఉంటున్న ప్రాంతంలోనే ఇరాన్ అధ్యక్ష కార్యాలయం
- సమీప ప్రాంతాల్లోనే ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. గత 24 గంటల నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం ఉధృతంగా సాగుతోంది. ఇక శనివారం జరిపిన దాడుల్లో.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా దాడులు జరిగాయి. ఖమేనీ నివాసం సమీపంలో క్షిపణులు పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. టెహ్రాన్‌లోని మోనిరియాలో ఖమేనీ నివాసం ఉంది. అక్కడే ఇరాన్ అధ్యక్ష కార్యాలయం కూడా ఉంది. ఈ సమీపంలోనే ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ మేరకు ఇరాన్ స్థానిక మీడియా తెలిపింది.
ఇది కూడా చదవండి: Israel Iran Conflict: ఇరాన్‌తో సంఘర్షణ.. భారత్‌కు క్షమాపణ చెప్పిన ఇజ్రాయిల్..
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
ఇరాన్ మిలటరీ చీఫ్‌గా అమీర్ హతామీని ఖమేనీ నియమించారు. శుక్రవారం జరిగిన దాడుల్లో మిలటరీ చీఫ్ బాఘేరి చనిపోయారు. బాఘేరి.. ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన నాయకుడు. అలాంటి నాయకుడు ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు.
ఇది కూడా చదవండి: Kethireddy Pedda Reddy: మరోసారి కేతిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. నా ఇంటికి నన్నే వెళ్లనివ్వరా..?
ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. 24 గంటల్లో వరుసగా రెండు సార్లు దాడులకు పాల్పడింది. శుక్రవారం జరిపిన దాడుల్లో ఇరాన్ కీలక నేతలంతా హతమయ్యారు. ఇక తాజాగా శనివారం మరొకసారి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 78 మంది మృతిచెందారని ఇరాన్ ఐక్యరాజ్యసమితి రాయబారి అమీర్ సయీద్ తెలిపారు. 320 మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. మృతుల్లో ఎక్కువ మంది పౌరులు, మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారని చెప్పారు. ఇజ్రాయెల్.. ఇరాన్‌లోని సైనిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని తెలిపారు.
ఇజ్రాయెల్ శుక్రవారం ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించింది. కేవలం ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. దీంతో అణు శాస్త్రవేత్తల సహా ఇరాన్ కీలక నేతలంతా చనిపోయారు. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్.. అణు కార్యక్రమంతో టెల్ అవీవ్ భద్రతకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తుందని పేర్కొంది. ఇదిలా ఉంటే ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతి దాడులు ప్రారంభించింది. మొదటి దాడికి ప్రతీకారంగా 100 డ్రోన్లు ప్రయోగించింది. వీటిని ఇజ్రాయెల్ గాల్లోనే తిప్పికొట్టింది. తాజాగా రెండో దాడికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. నివాసాల సమీపంలో పడడంతో 10 మంది గాయపడ్డారు. ఇక వీటిని కూడా ఐడీఎఫ్ ఎదుర్కొంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!