Trump: జీ7 నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన ట్రంప్.. ఆగమేఘాలపై అమెరికాకు పయనం
- జీ7 నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన ట్రంప్
- ఆగమేఘాలపై అమెరికాకు పయనం
- భద్రతా మండలి సమావేశంలో పాల్గొననున్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇరు పక్షాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక కెనడాలో జీ7 శిఖరాగ్ర సదస్సులో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. హుటాహుటిన అమెరికాకు పయనం అయ్యారు. అత్యవసరంగా భద్రతా మండలి సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. వచ్చీరాగానే భద్రతా మండలి సమావేశంలో పాల్గొననున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ వెల్లడించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Simran Kaur : హాట్ ఫొటోస్ తో సెగ పుట్టిస్తున్న సిమ్రన్ కౌర్
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
జీ7 సదస్సులో ట్రంప్ చర్చలు జరిపారని.. యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో కీలక ఒప్పందం చేసుకున్నట్లు లీవట్ వెల్లడించారు. పశ్చిమాసియాలో చోటుచేసుకున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ట్రంప్ అర్ధంతరంగా పర్యటన ముగించుకుని అమెరికాకు బయల్దేరినట్లు లీవిట్ పేర్కొన్నారు. ఇక ట్రంప్ కూడా జీ7 సభ్య దేశాల నేతలతో గ్రూప్ ఫొటో దిగిన తర్వాత అత్యవసరంగా తిరిగి వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ స్పందిస్తూ.. ట్రంప్ వెనుదిరగడం సరైన నిర్ణయమే అని అన్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని జీ7 నేతలు పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Genelia : పెళ్లి పుకార్లపై స్పందించిన హీరోయిన్..
ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టెహ్రాన్ ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే టెహ్రాన్‌ను ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇప్పటికైనా ఇరాన్‌కు సమయం మించిపోలేదని.. అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ సూచించారు. కెనడా వేదికగా జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందాన్ని అంగీకరించాల్సి ఉండాల్సిందని వ్యాఖ్యనించారు. మరింత సమయం ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని.. ఇప్పటికే రెండో అవకాశం ఇచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ట్రంప్ గుర్తుచేశారు.

తాజావార్తలు
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్‌ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!