Iran: యుద్ధం మొదలైంది.. ఎక్స్‌లో ఖమేనీ కీలక పోస్ట్
- యుద్ధం మొదలైంది
- ఎక్స్‌లో ఖమేనీ కీలక పోస్ట్
- ట్రంప్ హెచ్చరికలపై ఖమేనీ ప్రతిస్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత తీవ్రంగా ముదురుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధంలోకి ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికా కూడా ప్రవేశించబోతుంది. ఈ మేరకు ట్రంప్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా భీకర దాడులు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇక ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడున్నాడో తెలుసని.. కానీ ప్రస్తుతం చంపే ఉద్దేశం లేదని చెప్పారు. ప్రస్తుతానికి లొంగిపోతే మంచిదని.. లేదంటే పరిణామాలైతే తీవ్రంగా ఉంటాయని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Ileana: ఏంటి.. ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చిందా.. !
Also Read
ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఖమేనీ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో కీలక పోస్ట్ చేశారు. ‘‘యుద్ధం మొదలైంది’’ అంటూ పోస్టు చేశారు. ఇక కనికరించం అంటూ రాసుకొచ్చారు. ‘‘నమి పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్‌తో కలిసి ఖైబర్‌కు వచ్చేశారు’’ అని అందులో రాశారు. అంతేకాకుండా ఖడ్గం పట్టుకుని కోట గేటు దగ్గర ఓ వ్యక్తి ఉన్న ఫొటోను కూడా జత చేశారు. కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా కనిపిస్తోంది. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ తర్వాత దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉండబోతున్నట్లుగా అర్థమవుతోంది.
ఇది కూడా చదవండి:Encounter: మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి!
ఇదిలా ఉంటే బుధవారం కూడా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరిగాయి. తెల్లవారుజామున టెహ్రాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అలాగే టెల్ అవీవ్‌లోనూ పేలుళ్లు సంభవించాయి. ఇక జెరూసలెంలోని అమెరికా ఎంబసీని శుక్రవారం వరకు మూసేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్‌పై హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది.
به نام نامی #حیدر، نبرد آغاز میگردد
علی با ذوالفقار خود، به #خیبر باز میگردد#الله_اکبر pic.twitter.com/yGYrXUDGoK— KHAMENEI.IR | فارسی 🇮🇷 (@Khamenei_fa) June 17, 2025
"Help from Allah and an imminent conquest" (Holy Quran: 61:13).
The Islamic Republic will triumph over the Zionist regime by the will of God. pic.twitter.com/sUZvapaV4G
— Khamenei.ir (@khamenei_ir) June 16, 2025
We must give a strong response to the terrorist Zionist regime.
We will show the Zionists no mercy.— Khamenei.ir (@khamenei_ir) June 17, 2025
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!