తమ జట్టు ఫైనల్‌కి చేరిందంటే, ఏ ఆటగాడైనా సంతోషంగా ఉండకుండా ఉంటాడా? కానీ, మాథ్యూ వేడ్ మాత్రం సంతోషంగా లేనని బాంబ్ పేల్చాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్‌కి చేరినా.. తాను సంతోషంగా లేనని, వ్యక్తిగతంగా ఈ సీజన్ తనకు చాలా చిరాకు కలిగిస్తోందని అన్నాడు. ఇందుకు ప్రధాన కారణం.. తాను సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడమేనని వెల్లడించాడు. ‘‘నాకు ఈ సీజన్ వ్యక్తిగతంగా చిరాకు తెప్పిస్తోంది. నేను సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడమే అందుకు కారణం.…
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ అంత ఆశాజనకంగా రాణించలేదనే చెప్పుకోవాలి. మొదట్నుంచీ అతడు నిరాశపరుస్తూనే వచ్చాడు. మధ్యలో ఓసారి అర్థశతకం సాధించాడు కానీ, అది వింటేజ్ కోహ్లీ ఇన్నింగ్స్ అయితే కాదు. మరీ నిదానంగా రాణించడంతో, క్రికెట్ ప్రియులకు అది అంత కిక్ ఇవ్వలేదు. కానీ, నిన్న గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం కోహ్లీ ఉగ్రరూపం దాల్చాడు. ఏ కోహ్లీని అయితే క్రీడాభిమానులు చూడాలనుకున్నారో, ఆ కోహ్లీ విజృంభించాడు. ఎడాపెడా షాట్లతో మైదానంలో పరుగుల…
* ఐపీఎల్‌లో నేడు కోల్‌కతాతో తలపడనున్న లక్నో, ముంబై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటన * హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500, ఇక, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,780, కిలో వెండి ధర రూ.65,600 * నేడు జలశక్తి శాఖ అధికారులతో ఏపీ…
ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. దీంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా భారీ ఎత్తున బెట్టింగులు పెడుతున్నారు. ఒక్కో మ్యాచ్ కు కొన్ని వందల కోట్లు చేతులు మారుతున్నాయి. అధికారులు బెట్టింగ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నా బెట్టింగ్ కు ఎండ్ కార్డ్ పడటం లేదు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ బెట్టింగ్ పై సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని నాలుగు చోట్ల సోదాలు చేశారు సీబీఐ అధికారులు. 2103 నుంచి పాకిస్తాన్ కేంద్రంగా ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు…
* ఐపీఎల్‌లో నేడు ముంబైతో తలపడనున్న హైదరాబాద్, ముంబై వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం.. * హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250, * నేడు కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన, ఓర్వకల్ మండలం గుమ్మటం తాండా వద్ద నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్న సీఎం. * మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు, ఢిల్లీ…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ‘మిస్టర్ 360’ ఏబీ డీ విలియర్స్‌కి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తన హోమ్ టీమ్‌గానే ఆ జట్టుని గౌరవిస్తాడు. విరాట్ కోహ్లీతోనూ ఇతనికి మంచి అనుబంధం ఉంది. ఈ జోడీని చూసినప్పుడల్లా క్రికెట్ అభిమానులు మురిసిపోతుంటారు. కానీ, ఈ సీజన్ నుంచి మళ్ళీ ఏబీడీని చూడలేదమని, అతని 360 ఆటను చూడలేమని తెలిసి ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఏబీడీ..…
నిన్న (మే10) లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ సాధించిన విజయంలో శుబ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. ఇతర బ్యాట్స్‌మెన్స్ అంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరగా.. ఇతనొక్కడే 49 బంతుల్లో 7 ఫోర్లతో 69 పరుగులు చేసి, చివరివరకూ అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే సుధీర్ఘకాలం నుంచి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డ్‌ను అతడు అందుకున్నాడు. 2009లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్…
ముంబై ఇండియన్స్ జట్టులోని కీలకమైన ఆటగాళ్ళలో కీరన్ పొలార్డ్ ఒకడు. ఎన్నోసార్లు జట్టు ఆపదలో ఉన్నప్పుడు నెట్టుకురావడమే కాదు, కొన్నిసార్లు ఒంటిచేత్తో జట్టుని గెలిపించిన ఘనత అతని సొంతం. అవసరమైనప్పుడల్లా బ్యాట్‌కి పని చెప్పడమే కాదు, బంతితోనూ మాయ చేయగలడు. అంతటి ప్రతిభావంతుడు కాబట్టే, యాజమాన్యం రూ. 6 కోట్లు వెచ్చించి మరీ అతడ్ని రిటైన్ చేసుకుంది. ఎప్పట్లాగే ఈసారి కూడా మెరుపులు మెరిపిస్తాడని అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా ఇతను పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తూ వస్తున్నాడు.…
* ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు పంజాబ్‌తో రాజస్థాన్ ఢీ, రాత్రి 7.30 గంటలకు లక్నోతో కోల్‌కతా మ్యాచ్ * హైదరాబాద్‌లో నేడు రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన, ఉదయం 10 గంటలకు ఉద్యమకారులతో రాహుల్ సమావేశం, దామోదరం సంజీవయ్యకు నివాళులర్పించనున్న రాహుల్, చంచల్‌గూడ జైలులో ఎన్ఎస్యూఐ నేతలను కలవనున్న రాహుల్ గాంధీ * ఏపీలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు కేంద్ర బృందం పర్యటన, నేడు కడప జిల్లాలో భూములు పరిశీలించనున్న…
ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై, బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో, ఆర్సీబీ బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి దిగింది. ఓపెనర్లుగా వచ్చిన కోహ్లీ, ఫాప్.. మొదటి ఏడు ఓవర్ల వరకూ స్కోర్ బోర్డుని బాగానే లాక్కొచ్చారు. ఒక్క వికెట్ కూడా పడకుండా, ఏడు ఓవర్లలో 62 పరుగులు చేశారు. ఆ తర్వాత ఫాఫ్, మ్యాక్స్‌వెల్ వెనువెంటనే ఔట్ అవ్వడంతో.. ఆర్సీబీ స్కోర్ బోర్డ్…