టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి జయా భరద్వాజ్‌ను జూన్ 1న ఆగ్రాలో కుటుంబ సభ్యుల సమక్షంలో దీపక్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జయ భరద్వాజ్‌కు చాహర్ ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా సంతోషంగా అంగీకరించడంతో.. ఏడాది పాటు ఈ జంట ప్రేమ మత్తులో మునిగి తేలింది. గాయంతో దీపక్ చాహర్ క్రికెట్ కెరీర్‌కు బ్రేక్ రావడంతో వివాహం చేసుకున్నారు.
ఆగ్రాలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్న దీపక్ చాహర్.. సహచర ఆటగాళ్ల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. ఈ పెళ్లి రిసెప్షన్‌కు భారత యువ ఆటగాళ్లు చాలా మంది హాజరయ్యారు. వారిలో రిషభ్ పంత్, కర్ణ్ శర్మ, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్ తదితరులంతా వచ్చి చాహర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రిసెప్షన్‌కు సంప్రదాయ పఠానీ కుర్తాలో వచ్చిన వ్యక్తిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
పాకిస్థాన్ ప్లేయర్ హసన్ అలీలా ఉండటంతో అతన్ని కూడా రిసెప్షన్‌కు పిలిచారా? అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. భారత ఆటగాళ్లకు సంబంధించి ఫొటో నెట్టింట వైరల్ కాగా.. హసన్ అలీని పోలి ఉన్న వ్యక్తి విషయంలో గందరగోళానికి గురయ్యారు. అసలు అతన్ని ఎవరు పిలిచారంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు.
అయితే ఆ ఫొటోను నిశితంగా పరిశీలిస్తే అతను హసన్ అలీ కాదని తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున IPL లో అద్భుతంగా రాణించిన భారత్ పేసర్ ఖలీల్ అహ్మద్ అని స్పష్టమైంది. అతని వేషధారణ వల్లే ఈ కన్‌ఫ్యూజన్ వచ్చిందని మరికొందరు నెటిజన్లు వివరించారు.
IPL 2022 సీజన్‌కు ముందు వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో దీపక్ చాహర్ గాయపడ్డాడు. దాంతో ఎన్‌సీఏలో చేరిన అతను గాయం నుంచి కోలుకుంటున్న దశలో మరో గాయానికి గురయ్యాడు. వెన్ను నొప్పి గాయానికి గురవ్వడంతో ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతని గైర్హాజరీ ఆ జట్టుకు తీవ్ర నష్టం చేసింది.