Virat Kohli: అరుదైన రికార్డ్.. ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ అంత ఆశాజనకంగా రాణించలేదనే చెప్పుకోవాలి. మొదట్నుంచీ అతడు నిరాశపరుస్తూనే వచ్చాడు. మధ్యలో ఓసారి అర్థశతకం సాధించాడు కానీ, అది వింటేజ్ కోహ్లీ ఇన్నింగ్స్ అయితే కాదు. మరీ నిదానంగా రాణించడంతో, క్రికెట్ ప్రియులకు అది అంత కిక్ ఇవ్వలేదు. కానీ, నిన్న గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం కోహ్లీ ఉగ్రరూపం దాల్చాడు. ఏ కోహ్లీని అయితే క్రీడాభిమానులు చూడాలనుకున్నారో, ఆ కోహ్లీ విజృంభించాడు. ఎడాపెడా షాట్లతో మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. 54 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ నేపథ్యంలోనే కోహ్లీ ఓ అరుదైన రికార్డ్ సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ జట్టు తరఫున ఏడు (7) వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్మన్‌గా రికార్డులకెక్కాడు. కోహ్లీ సాధించిన ఏడు వేల పరుగుల్లో 6,600 పరుగులు ఐపీఎల్‌లో రాగా.. మిగతా రన్స్ చాంపియన్స్ లీగ్‌లో సాధించినవి. అయితే, ఈ లీగ్ ప్రస్తుతం ఉనికిలో లేదు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ చేసిన 73 పరుగులు ఈ సీజన్‌లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఈ సీజన్ మొత్తంలో అతడు చేసిన అర్థశతకాలు రెండే! ఈ మ్యాచ్‌లో గెలుపొందడంతో, బెంగళూరు ప్లే ఆఫ్స్ ప్లే ఆఫ్స్ రేసులో ఇంకా నిలిచే ఉంది. అయితే.. ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే మాత్రం ఢిల్లీ కేపిటల్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ గెలవాలి. ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే.. రన్ రేట్ కారణంగా బెంగళూరు ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది.
Also Read
- Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
- World Cup 2027: తిలక్ వర్మకు గోల్డెన్ ఛాన్స్.. బీసీసీఐ ప్లాన్ చేసిన టాప్ ఆటగాళ్ల జాబితా ఇదే..
- Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరణ..
- Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్‌పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!