IPL 2022 సీజన్ లో మునుపెన్నడూ లేని విధంగా ముంబై జట్టు అత్యంత ఘోరంగా విఫలమైంది. వరుసగా ఎనిమిది ఓటములను మూటగట్టుకొని పాయింట్ల పట్టికలో లాస్ట్ నుండి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అసలు ఇది ముంబై జట్టేనా, ఐదు సార్లు టైటిల్ గెలిచినా జట్టేనా అన్నట్లు ఆడింది. రోహిత్ శర్మ, పోలార్డ్ ,ఇషాంత్ కిషన్ ,బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ కనీసం వల్ల స్థాయికి తగ్గట్టు కూడా ఆడకపోవడంతో IPL చరిత్రలోనే ముంబై జట్టు చాలా దారుణంగా విఫలమయ్యి, అభిమానులను కూడా నిరాశపరిచింది.
ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మొదటి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవని ఆ జట్టు చివరి ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది. చివరి మ్యాచుల్లో జట్టులో కొన్ని కీలక మార్పులు చేయడం ఆ టీమ్‌కు కలిసొచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించి పంత్ సేనను ప్లే ఆఫ్‌కు చేరకుండా నిలువరించగలిగింది. దింతో వచ్చే సీజన్ కోసం ముంబై భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైన ఓ ఐదుగురి ఆటగాళ్లపై వేటు వేసే అవకాశం ఉంది. మరి వారెవరో చూద్దమా…
1. జయదేవ్ ఉనాద్కత్…
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు అండగా ఉంటాడని వేలంలో రూ.1.3 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన ఉనాద్కత్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఐదు మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీసినప్పటికీ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా పరుగులు ఇచ్చాడు.
2. మయాంక్ మార్కండే
జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేని లోటును తీరుస్తాడని భావించి రూ.65 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసిన ప్లేయర్ మాయంక్ మార్కండే తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు మ్యాచ్‌ల్లో అవకాశం ఇచ్చినా అతను తన సత్తాను నిరూపించుకోలేకపోయాడు.
3. ఫాబియన్ అలెన్
వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఫాబియన్ అలెన్ సైతం ముంబై అంచనాలను అందుకోలేకపోయాడు. దాంతో అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఒక్క మ్యాచ్‌లో అవకాశం దక్కగా బౌలింగ్‌లో ధారళంగా పరుగిలచ్చాడు. దింతో రూ.75 లక్షలతో ఏరి కోరి తెచ్చుకున్న ముంబై అతన్ని వదులుకునే చాన్స్ ఉంది.
4. టైమిల్ మిల్స్
ఇంగ్లండ్ స్టార్ పేసర్ టైమిల్ మిల్స్ సైతం దారుణంగా విఫలమయ్యాడు. వేలంలో రూ.1.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ముంబై.. అతని పేలవ ప్రదర్శనతో పక్కపెట్టాలనుకుంటుంది. ఐదు మ్యాచ్‌లు ఆడిన మిల్స్ 6 వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులిచ్చాడు.
5. బసిల్ థంపీ
మెగా వేలంలో రూ.30 లక్షలకే కొనుగోలు చేసిన బసిల్ థంపీ సైతం జట్టు అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన థంపీ కేవలం ఐదు వికెట్లు తీసి దారుణంగా పరుగలిచ్చాడు.