ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. దీంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా భారీ ఎత్తున బెట్టింగులు పెడుతున్నారు. ఒక్కో మ్యాచ్ కు కొన్ని వందల కోట్లు చేతులు మారుతున్నాయి. అధికారులు బెట్టింగ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నా బెట్టింగ్ కు ఎండ్ కార్డ్ పడటం లేదు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ బెట్టింగ్ పై సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని నాలుగు చోట్ల సోదాలు చేశారు సీబీఐ అధికారులు. 2103 నుంచి పాకిస్తాన్ కేంద్రంగా ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తోంది ఈ ముఠా.
బెట్టింగ్ నెట్ వర్క్ లో ఢిల్లీ, జోధ్ పూర్, జైపూర్, హైదరాబాద్ కు చెందిన వారిపై కేసులు నమోదుచేసింది. కొందరు ప్రైవేటు వ్యక్తులు, గుర్తు తెలియని ప్రభుత్వ అధికారులు ఇళ్లపై సీబీఐ అధికారులు దాడులు చేస్తున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది సీబీఐ. ఎఫ్ఐఆర్ లో ఢిల్లీకి చెందిన దిలీప్ కుమార్ తో పాటు హైదరాబాద్ కు చెందిన గుర్రం సతీష్, గుర్రం వాసుల పేర్లు ఉన్నాయి.
ఐపీఎల్ మ్యాచ్ ల ఫలితాలను ప్రభావితం చేసే విధంగా ఈ నెట్ వర్క్ పని చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల ఖాతా ద్వారా ఇప్పటి వరకు రూ. 10 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. 2010 నుంచి ఈ నెట్ వర్క్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతోంది. పాకిస్తాన్ కు చెందిన వాకస్ మాలిక్ పేరుతో బెట్టింగ్ జరుతుందని తేలింది. పాకిస్తాన్ నుంచి వాకస్ మాలిక్ హైదరాబాద్ లోని గుర్రం సతీష్ తో డైరెక్ట్ గా కాంటాక్ట్ పెట్టుకున్నాడు. దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఖాతాలో 2013 నుంచి దాదాపు 43 లక్షలకు పైగా నిధులు ఉన్నట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది సీబీఐ. రెండో ఎఫ్ఐఆర్ లో సజ్జన్ సింగ్, ప్రభు లాల్ మీనా, రామ్ అవతార్, అమిత్ కుమార్ పేర్లు ఉన్నాయి.