భారత జట్టు ప్రస్తుతం యూఏఈలో ఆసియా కప్ 2025లో ఆడుతోంది. రెండు సూపర్-4 మ్యాచ్‌లను గెలిచిన టీమిండియా ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్‌లో పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. అయితే బంగ్లాదేశ్‌తో సూపర్-4 మ్యాచ్ అనంతరం టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడాలనే తన కోరికను వ్యక్తం చేశాడు. తనను జట్టులోకి తీసుకోవాలని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కోరినట్లు చెప్పాడు. ఇందుకు సంబంధించిన…
BCCI Terminates Dream 11 Sponsorship Deal: భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ‘డ్రీమ్ 11’తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒప్పందంను రద్దు చేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన నేపథ్యంలో.. బీసీసీఐ సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ ఇలాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోమని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా తెలిపారు. కొత్త చట్టం కారణంగా ఒప్పందాన్ని కొనసాగించలేమని డ్రీమ్ 11 ప్రతినిధులకు బీసీసీఐ…
Glenn Maxwell : గ్లెన్ మాక్స్వెల్, ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో తనదైన ముద్ర వేసాడు.ముందు కొండంత లక్ష్యం వున్నా అలవోకగా ఛేదిస్తాడు. ఇక టార్గెట్ చేయాలన్నా తనదైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతుంటాడు. ఇక బ్యాటెర్ గానే కాకుండా బౌలర్ కూడా వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటాడు. ఇలా.. గ్లెన్ మాక్స్వెల్ ఐపీఎల్ లో తనదైన ముద్ర వేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్ లో ఆడుతున్నాడు.…
ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తొలిసారిగా టైటిల్ గెలుచుకుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంతో.. బెంగళూరులో విక్టరీ పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ చేశారు. అయితే ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగి.. 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా…
పంజాబ్ ప్లేయర్ జితేష్ శర్మను ఆర్సీబీ మెగ వేలంలో రూ.11 కోట్లకు దక్కించుకుంది. అప్పుడు అర్ధం కాలేదు. జితేష్ కెప్టెన్సీలో ఆర్సీబీ క్వాలిఫయర్ వన్‌కి చేరుతుందని. లక్నోపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి అంచున ఉండగా.. ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్నాడు.
PBKS vs MI: ఐపీఎల్ 2025 మెగా టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుంది. అయితే, టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన.. ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
కేకేఆర్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి రెచ్చిపోయి ఆడింది. 278 పరుగులతో కేకేఆర్ బౌలర్లకు నరకం చూపించారు. రెస్ట్ ఆఫ్ సీజన్‌లో దారుణ విమర్శలు ఎదుర్కొన్న బ్యాటర్లు చివర్లో వరుస విజయాలతో సీజన్ ని ముగించారు. ఈ మ్యాచ్ లో హేన్రిచ్ క్లాస్సేన్, ట్రావిస్ హెడ్ విధ్వంసానికి కేకేఆర్ బౌలర్లు దాసోహమయ్యారు. నలుదిక్కులా షాట్లు బాదుతూ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. Also Read:Kakani Govardhan Reddy: పరిణామాలు…
కీలక దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీని చావుదెబ్బ కొట్టింది. ఈ ఓటమితో క్వాలిఫయర్ వన్‌కి అర్హత సాధించాలని భావించిన ఆర్సీబీకి చుక్కెదురైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.
మీ మీద అంచనాలు పెరిగినప్పుడు ఒత్తిడికి గురికావొద్దని ఎంఎస్ ధోనీ తెలిపారు. సీనియర్ ప్లేయర్స్, కోచింగ్ స్టాఫ్ నుంచి అన్ని విషయాలను నేర్చుకోండి.. యువ ఆటగాళ్లు 200 ప్లస్ స్ట్రైక్‌రేట్‌తో రన్స్ చేయాలనుకున్నప్పుడు, బ్యాటింగ్‌లో నిలకడ కొనసాగించడం కష్టం.. అయినా మ్యాచ్‌లో ఏ దశలో అయినా సిక్స్‌లు కొట్టగల సామర్థ్యం వారు సొంతం చేసుకోవాలని ఎంఎస్ ధోనీ పేర్కొన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. మన దేశం సాధించిన ఈ విజయంతో పాకిస్థాన్ నేతలు చిరాకుపడి.. తామే గెలిచామంటూ తమ డబ్బు తామే కొట్టుకుంది. తాజాగా ఉద్రిక్తత పరిస్థితుల అనంతరం భారత్‌ను కాపీ కొట్టడంలో పాకిస్థాన్ బిజీగా మారింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు సామేత ప్రస్తుతం పాకిస్థాన్‌కి బాగా అబ్బుతుంది.