వర్థమాన కథానాయకుడు విశ్వ కార్తికేయ నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. అతను నటించిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ 'అల్లంత దూరాన...' సినిమాతో పాటే క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో తెరకెక్కిన 'ఐపీఎల్' కూడా ఈ నెల 10న జనం ముందుకు వస్తోంది.
లాస్ట్ వీకెండ్ మొత్తం ఏడు చిత్రాలు విడుదల కాగా, ఇప్పుడు వాటికి మరో రెండు జతై తొమ్మిది చిత్రాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'అమిగోస్'. ఇది హిట్ అయితే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ హ్యాట్రిక్ కొట్టినట్టే!
క్రికెట్, తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన 'ఐపీఎల్' మూవీ ఈ నెల 10న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సినీ ప్రముఖులు పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
Reliance Jio: ఐపీఎల్ సీజన్‌కు సమయం దగ్గర పడుతోన్న వేళ.. క్రికెట్ లవర్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పింది రిలయన్స్ జియో.. జియో సినిమా యాప్‌లో ఫిఫా వరల్డ్ కప్ 2022ని ఉచితంగా ప్రసారం చేసిన తర్వాత, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ డిజిటల్ ప్రసారం కోసం రిలయన్స్ ఇదే మోడల్‌ను ప్రయత్నించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.. రిలయన్స్ వెంచర్ అయిన వయాకామ్ 18, ఐపీఎల్ 2023-2027 సీజన్‌ల డిజిటల్ మీడియా హక్కులను గతేడాది రూ.…
బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన విశ్వ కార్తికేయ ఇప్పుడు మూడు చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో 'అల్లంత దూరాన' చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది!
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కొత్త ప్రధాన కోచ్‌గా వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను నియమించింది. లెజెండరీ బ్యాట్స్‌మన్ టామ్ మూడీ స్థానంలో బ్రియాన్ లారాను ప్రధాని కోచ్‌గా నియమించినట్లు ఎస్ఆర్హెచ్ అధికారికంగా ధ్రువీకరించింది.
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఊహించని షాక్ ఇచ్చాడు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించిన పోస్టులను డిలీట్ చేశాడు. దీంతో.. సీఎస్కేకి జడేజా గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలు మరింత బలపడ్డాయి. నిజానికి.. చెన్నై జట్టుకి డెడికేటెడ్‌గా ఉన్న ఆటగాళ్లలో జడేజా ఒకడు. అతడు అత్యంత కీలకమైన ప్లేయర్ కూడా! ఒంటిచేత్తోనే ఆ జట్టుని ఎన్నోసార్లు ముందుకు నడిపించిన సందర్భాలున్నాయి. అలాంటి జడేనా.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు.…
క్యాష్ రిచ్ లీగ్ అయిన ఐపీఎల్‌కు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ లీగ్ ప్రారంభం అవుతోందంటే చాలు.. వారం రోజుల ముందు నుంచే పండగలాంటి వాతావరణం నెలకొంటుంది. ఇంత క్రేజ్ ఉండటం వల్లే.. ఈ లీగ్‌ను మరింత పొడిగించాలని నిర్ణయించారు. అవును, ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపాడు. రానున్న సీజన్‌ల నుంచి ఐపీఎల్‌ను రెండున్నర నెలలకు పెంచబోతున్నట్టు ఆయన స్పష్టం చేశాడు. అంటే.. వరుసగా 10…