భారత యువ బౌలర్ దీపక్ చాహర్ మొత్తానికి ఓ ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన జయ భరద్వాజ్‌ను పెళ్లాడాడు. నిన్న ఆగ్రాలో వీరి వివాహం జరిగింది. గత ఏడాది జరిగిన IPL 2021లో CSK చివరి మ్యాచ్ తర్వాత 29 ఏళ్ల ఈ యువ ఆటగాడు గ్రౌండ్ లోనే జయకు ప్రపోజ్ చేశాడు. అయితే మొత్తానికి అతను మనసు పడ్డ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. దీపక్ తన ఇన్‌స్టాగ్రామ్ నుండి తన పెళ్లి ఫోటోలను పంచుకున్నాడు. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలని కోరాడు.
దీపక్ కజిన్ ఐన మరో భారత ఆటగాడు రాహుల్ చాహర్ కూడా ఈ పెళ్లి హాజరయ్యాడు. అయితే తాజాగా ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో దీపక్ చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దీపక్ IPL టోర్నమెంట్‌లో అత్యంత ఖరీదైన భారతీయ బౌలర్‌గా నిలిచాడు. అయితే గాయం కారణంగా అతను మొత్తం టోర్నీ నుంచి తప్పుకున్నట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది.