* ఐపీఎల్‌లో నేడు కోల్‌కతాతో తలపడనున్న లక్నో, ముంబై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటన
* హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500, ఇక, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,780, కిలో వెండి ధర రూ.65,600
* నేడు జలశక్తి శాఖ అధికారులతో ఏపీ అధికారుల సమావేశం,
* నేడు తూర్పుగోదావరి జిల్లా తొలి డీఆర్సీ సమావేశం, 15 అంశాల అజెండా రూపకల్పన, హాజరుకానున్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు
* విశాఖ: నేడు రైల్వేకోర్టుకు మాజీమంత్రి కొణతాల రామకృష్ణ, పలువురు రాజకీయ నాయకులు, విభజన హామీల అమలు కోసం 2018లో చేపట్టిన రైలు యాత్రపై కేసులు నమోదు చేసిన రైల్వే పోలీసులు
* నేడు కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం
* నేడు గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యే మేకతోటి సుచరిత
* అనంతపురం: కళ్యాణదుర్గం మండలం నుసికొట్టాల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉష శ్రీ చరణ్.
* నేడు కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన, ఉదయం 10.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్న బాబు, 11 గంటలకు కడప ఇర్కాన్ సమీపంలోని DSR కళ్యాణమంటపంలో ఉమ్మడి కడప జిల్లా సమన్వయ కమిటీ సమవేశం, మధ్యాహ్నం 12 గంటలకు ఉమ్మడి కడప జిల్లా విస్తృత స్థాయి సమావేశం, మధ్యాహ్నం 3 గంటలకు కడప నుండి బయలుదేరి చెన్నూరు, ఖాజీ పేట మీదుగా కమలాపురం చేరుకోన్న టీడీపీ అధినేత, సాయంత్రం 4 గంటలకు కమలాపురంలో బాదుడే బాదుడు కార్యక్రమం
* మన్యం జిల్లా: నేడు పార్వతీపురంలో వై ఎస్ ఆర్ సి పి విస్తృత సమావేశం, హాజరుకానున్న మంత్రులు బొత్స సత్యనారాయణ మరియు డిప్యూటీ సీఎం పిడిక రాజన్నదొర
* మహానాడు ఏర్పాట్లను ముమ్మరం చేయనున్న టీడీపీ.. ఒంగోలు మహానాడు నిర్వహణ ప్రాగంణంలో ఇవాళ భూమి పూజ చేయనున్న టీడీపీ నేతలు