ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత భీకర స్థాయిలో ఉంది. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని దేశాలు కఠినంగా ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇవే ఆంక్షలు స్వయంగా ఓ దేశ ప్రధాన మంత్రి వివాహాన్ని అడ్డుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి న్యూజిలాండ్‌లో కరోనా ఆంక్షలను కఠినతరం చేశారు. దీంతో న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. Read Also: గిన్నిస్…
ఆ యువతి వయసు 19. సాధారణంగా ఆ వయసులో కొంతమందికి లోక జ్ఞానం కూడా ఉండదు. అయితే సదరు యువతి మాత్రం ఒంటరిగా ప్రపంచాన్నే చుట్టేసింది. ఏకంగా 41 దేశాలలో ప్రయాణించి అతి చిన్న వయసులో ప్రపంచాన్ని చుట్టేసిన మహిళగా గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కేసింది. వివరాల్లోకి వెళ్తే… బెల్జియంకు చెందిన రూథర్‌ఫర్డ్ అనే 19 ఏళ్ల యువతి చిన్న వయసులోనే సాహసయాత్రకు శ్రీకారం చుట్టింది. ఏకంగా ఐదు నెలల పాటు ఇంట్లో వాళ్లకు దూరంగా ఒంటరిగా…
ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు సత్తాచాటుతూనే ఉన్నారు. ఇప్పటికే తెలుగువారు ప్రపంచంలోని పలు దేశాల్లో తమదైన ముద్ర వేసి కీలక పదవులు దక్కించుకుంటున్నారు. తాజాగా ఓ తెలుగమ్మాయి అరుదైన గౌరవం దక్కించుకుంది. న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా తెలుగుమ్మాయి మేఘన ఎంపికైంది. యువతరం ప్రతినిధిగా టీనేజి వయసులోనే ఆమె చట్టసభలోకి ప్రవేశించింది. 18 ఏళ్ల మేఘన వాల్కటో ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. Read Also: వైరల్… ‘పుష్ప’ను వాడేసుకున్న అమూల్ మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. ఆమె తండ్రి…
ఒకప్పుడు భారత దేశాన్ని దోచుకున్న ఆంగ్లేయులకు ఇప్పుడు ఓ భారతీయుడు ప్రధాని కాబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై ప్రస్తుతం ఉద్వాసన కత్తి వేలాడుతోంది. దీంతో తదుపరి ప్రధానిగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతత వ్యక్తి, బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషి సూనక్ నియమితులవుతారని బ్రిటన్ మీడియా కథనాలు ప్రచురించింది. 2020 మే నెలలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రధాని బోరిస్ పెద్ద ఎత్తున మందు పార్టీ చేసుకున్నారన్న…
బ్రెజిల్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్రెజిలియన్ సరస్సులో పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై ఒక్కసారిగా పర్వతం కొండ చరియలు విరిగిపడిపోవడంతో ఏడుగురు మరణించారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని అగ్నిమాపక అధికారులు తెలిపారు. శనివారం ఆగ్నేయ బ్రెజిల్‌లోనిమినాస్ గెరైస్ రాష్ట్రంలోని కాపిటోలియో వద్ద ఉన్న సరస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక పెద్ద పర్వతం లోయ గోడ ఒక్కసారిగా పడవలపై పడింది. Read Also:వ్యవసాయంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలోఉంది: మంత్రి కన్నబాబు ప్రస్తుతం ఈ ఘటనకు…
పాకిస్థాన్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హిల్ స్టేషన్ ముర్రీలో భారీస్థాయిలో కురిసిన మంచు కారణంగా పలు వాహనాలు చిక్కుకుపోయాయి. ఊపిరి ఆడనీయలేనంత దట్టంగా కార్లపై మంచు పేరుకుపోయింది. దీంతో ఆయా వాహనాల్లో ఉన్న వారిలో 22 మంది పర్యాటకులు మరణించారు. మృతుల్లో 9 మంది చిన్నారులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వందలాది వాహనాలను మంచు నుంచి వెలికితీశామని.. వెయ్యికిపైగా వాహనాలు ఇంకా మంచులోనే కూరుకునిపోయి ఉన్నట్లు వారు వివరించారు. Read Also: తెలంగాణ ప్రజలకు అలర్ట్..…
మహిళలను హింసించడం.. దేవుడ్ని అవమానించినట్లేనని నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ సందేశమిచ్చారు. మహిళలపై జరుగుతున్న హింసకు ముగింపు పలకాలంటూ పిలుపునిచ్చారు. సెయింట్ పీటర్స్ బసలీకా రోమన్ కాథలిక్‌లో ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరాధన నిర్వహించారు. Read Also క్రిస్ గేల్‌కు షాకిచ్చిన వెస్టిండీస్ బోర్డు అలాగే నూతన వేడుకల సందర్భంగా చేసిన ప్రసంగంలో మాతృత్వం, స్త్రీల సమస్యల గురించి ప్రస్తావించారు. జీవితాలు వీరితోనే ముడిపడి ఉన్నాయని అన్నారు. వారిపై హింసను ముగింపు పలకాలని…
సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బంగారం కోసం వెళ్లిన జనం ఒక్కసారి బంగారం గని కూలిపోవడంతో 38 మంది మృతి చెందినట్లు సూడాన్ ప్రభుత్వ మైనింగ్ కంపెనీ వెల్లడించింది. సూడాన్ రాజధాని ఖార్టోమ్‌కు 700 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గత కొంత కాలం క్రితమే సూడాన్ ప్రభుత్వం ఈ బంగారం గనిని మూసివేసింది. బంగారం కోసం స్థానిక ప్రజలు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సూడాన్‌లో…
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించింది. గయానా నుంచి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఎరియాన్-5 రాకెట్ ద్వారా నింగిలోకి అతిపెద్ద వెబ్ స్పేస్ టెలీస్కోప్ను విజయవంతంగా నాసా సైంటిస్టులు ప్రవేశపెట్టారు. దీని ద్వారా విశ్వం పుట్టుక తొలినాళ్లలో ఏర్పడిన గెలాక్సీలను వెబ్ స్పేస్ టెలీస్కోప్ పరిశోధనలు జరపనుంది. ఓ రకంగా ఇది గత కాలానికి చెందిన ప్రయాణాన్ని సుసాధ్యం చేసే టైం మెషీన్లాంటిది. 21 అడుగుల పొడవైన వెబ్ స్పేస్…
తమ దేశంలో జనాభా పెరుగుదలకు చైనా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా వివాహం చేసుకున్న దంపతుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దంపతులు పిల్లల్ని కంటే ‘బేబీ లోన్’ పేరుతో రూ.25 లక్షలు వరకు బ్యాంకు రుణం ఇప్పిస్తామని చైనాలోని జిలిన్ ప్రావిన్స్ వెల్లడించింది. పిల్లల సంఖ్యను బట్టి వడ్డీ రేట్లలో డిస్కౌంట్లు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఒకవేళ అప్పటికే పిల్లలు ఉన్న దంపతులు ఏదైనా వ్యాపారం చేస్తుంటే పన్నులో మినహాయింపు…