తమ దేశంలో జనాభా పెరుగుదలకు చైనా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా వివాహం చేసుకున్న దంపతుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దంపతులు పిల్లల్ని కంటే ‘బేబీ లోన్’ పేరుతో రూ.25 లక్షలు వరకు బ్యాంకు రుణం ఇప్పిస్తామని చైనాలోని జిలిన్ ప్రావిన్స్ వెల్లడించింది. పిల్లల సంఖ్యను బట్టి వడ్డీ రేట్లలో డిస్కౌంట్లు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఒకవేళ అప్పటికే పిల్లలు ఉన్న దంపతులు ఏదైనా వ్యాపారం చేస్తుంటే పన్నులో మినహాయింపు ఇచ్చే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
Read Also: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. డెలివరీ ఎప్పుడంటే?
కాగా కొన్నేళ్లు చైనాలో జనాభా రేటు గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దీంతో ఆ దేశంలో యువ జనాభా తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. తద్వారా తమ దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందని చైనా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే గతంలో అమలులో ఉన్న ‘ఒక్కరు ముద్దు-అసలే వద్దు’ అనే నినాదాన్ని పక్కన బెట్టింది. యువకులు త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే కొంతమంది ఖర్చులకు భయపడి పిల్లలను కనడంలేదు. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగి ప్రత్యేకంగా రుణాలు ఇప్పిస్తామని ప్రకటనలు చేస్తోంది.