నాసా ప్రయోగం సక్సెస్… అంతరిక్షంలోకి అతిపెద్ద టెలీస్కోప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించింది. గయానా నుంచి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఎరియాన్-5 రాకెట్ ద్వారా నింగిలోకి అతిపెద్ద వెబ్ స్పేస్ టెలీస్కోప్‌ను విజయవంతంగా నాసా సైంటిస్టులు ప్రవేశపెట్టారు. దీని ద్వారా విశ్వం పుట్టుక తొలినాళ్లలో ఏర్పడిన గెలాక్సీలను వెబ్ స్పేస్ టెలీస్కోప్ పరిశోధనలు జరపనుంది. ఓ రకంగా ఇది గత కాలానికి చెందిన ప్రయాణాన్ని సుసాధ్యం చేసే టైం మెషీన్‌లాంటిది. 21 అడుగుల పొడవైన వెబ్ స్పేస్ టెలీస్కోప్‌కు నాసా సైంటిస్టులు రూ.75వేల కోట్ల ఖర్చు పెట్టారు.
Read Also: తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
Also Read
ఈ టెలీస్కోప్ 13.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డ గెలాక్సీకి చెందిన గుట్టు విప్పనుంది. ఈ టెలీస్కోప్ ద్వారా విశ్వంలోని నక్షత్రాలు, పాలపుంతలను సైంటిస్టులు పరిశోధించనున్నారు. అపోలో అంతరిక్ష ప్రయోగ రూపకల్పనలో పాలు పంచుకున్న జేమ్స్ ఇ.వెబ్ పేరునే సైంటిస్టులు ఈ టెలీస్కోప్‌కు పెట్టారు. హబుల్ టెలీస్కోప్ వారసత్వాన్ని కొనసాగించటానికి రంగంలోకి దిగుతున్న దీనికి షార్ట్ ఫామ్‌లో ‘వెబ్’ అని పిలుచుకుంటున్నారు. హబుల్ టెలీస్కోప్ కంటే వెబ్‌స్పేస్ టెలీస్కోప్ రెండున్నర రెట్లు పెద్దది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ అకాడమీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. కంటికి కనిపించే నక్షత్రాలను వెయ్యి కోట్ల రెట్ల స్పష్టతతో వెబ్ స్పేస్ చూపించనుంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!