Iran: ఇరాన్ దేశంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర ప్రాంతంలోని ఓ డ్రగ్ రిహాబ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగి 32 మంది మరణించారు. ఉత్తర గిలాన్ ప్రావిన్స్‌లోని లాంగరుడ్ నగరంలోని డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్ లో చెలరేగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 27 నుంచి 32కి పెరిగినట్లు ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ మొహమ్మద్ జలాయ్ తెలిపారు.
Pakistan: బాంబు పేలుళ్లతో మరోసారి దాయాది దేశం పాకిస్తాన్ దద్దరిల్లింది. శుక్రవారం పాక్ వాయువ్య ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలో పేలుడు జరిగింది. పోలీసులే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. 21 మంది గాయపడ్డారు. నగరంలోని పోలీస్ పెట్రోలింగ్ రూట్‌కి సమీపంలో బాంబు పేలిందని పోలీస్ అధికారి మహ్మద్ అద్నాన్ తెలిపారు.
Pakistan: పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం అల్టిమేటంతో ఆ దేశంలో ఉంటున్న లక్షలాది మంది ఆఫ్ఘన్ ప్రజలు సొంతదేశానికి ప్రయాణమయ్యారు. ఇప్పటికే 1,40,000 మందికి పైగా వలసదారులు స్వచ్ఛందంగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సరైన పత్రాలు లేని వలసదారులు పాకిస్తాన్ వదిలి వెళ్లాలని, ఇందుకు నవంబర్ 1ని డెడ్‌లైన్‌గా పెట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఆఫ్ఘాన్లు సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తున్నారు.
మంగళవారం రాత్రి లాస్ వెగాస్ మెట్రోపాలిటన్ పోలీస్ పోలీసులకు బ్లూ డైమండ్ రోడ్, బఫెలో డ్రైవ్ సమీపంలో ఒక వ్యక్తి నగ్నంగా తిరుగుతున్నాడని పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి సమాచారం ఇచ్చారు.
Israel-Hamas war: ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్యన జరుగుతున్న యుద్ధం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు యుద్దాన్ని విరమించుకోవాలని ప్రపంచ దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. యుద్దాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన గాజాలో కొనసాగుతున్న దాడులను విరమించుకోము అని తెలిపారు. అలా చేస్తే హమాస్‌కు లొంగిపోయినట్టే అవుతుందని అన్నారు. కాల్పుల విరమణకు పిలుపునివ్వడం అంటే ఉగ్రవాదానికి, అనాగరికతకు లొంగిపోవడమేనని..…
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ నిరంతరం గాజాపై బాంబు దాడులు చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగా.. వెస్ట్ బ్యాంక్ నగరంలోని అరూరాలోని సీనియర్ హమాస్ అగ్రనాయకుడు సలేహ్ అల్-అరౌరీ ఇంటిని కూల్చివేసింది. . ఈ నాయకుడి పేరు సలేహ్ అల్-అరూరి. అతను హమాస్ పొలిటికల్ బ్యూరో డిప్యూటీ చీఫ్, వెస్ట్ బ్యాంక్‌లో హమాస్ మిలిటరీ కమాండ్ నాయకుడు.
ప్రయాణికులను ఆకర్షించేందుకు థాయ్ ప్రభుత్వం వీసా రహిత ప్రవేశ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఆగ్నేయాసియా దేశం టూరిజంను పెంచాలని చూస్తున్నందున భారతీయులు నవంబర్ 10 నుంచి మే 10, 2024 వరకు వీసా లేకుండా థాయ్‌లాండ్‌కు వెళ్లవచ్చు. థాయ్‌లాండ్‌కు ప్రధాన పర్యాటక వనరులలో భారతదేశం ఒకటి.