Israel Hamas War: వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యం చర్య.. హమాస్ అగ్రనాయకుడి ఇంటిపై బాంబు దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Hamas War: ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ నిరంతరం గాజాపై బాంబు దాడులు చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగా.. వెస్ట్ బ్యాంక్ నగరంలోని అరూరాలోని సీనియర్ హమాస్ అగ్రనాయకుడు సలేహ్ అల్-అరౌరీ ఇంటిని కూల్చివేసింది. . ఈ నాయకుడి పేరు సలేహ్ అల్-అరూరి. అతను హమాస్ పొలిటికల్ బ్యూరో డిప్యూటీ చీఫ్, వెస్ట్ బ్యాంక్‌లో హమాస్ మిలిటరీ కమాండ్ నాయకుడు. అక్టోబర్ 27న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దీనిని స్వాధీనం చేసుకుంది. ఇల్లు కూల్చివేతకు సంబంధించిన వీడియో బయటపడింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) నియంత్రిత పేలుడును నిర్వహించిందని ఆ వీడియోలో కనిపించింది. అక్టోబర్ 27న ఐడీఎఫ్ సెంట్రల్ కమాండ్ అధిపతి మేజర్ జనరల్ యెహుదా ఫాక్స్ ఇంటిని ధ్వంసం చేయడానికి అనుమతి ఇచ్చారు. ఈ ఇంట్లో ఎవరైనా నివసించారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు..
లెబనాన్‌లో ఉన్న అల్-అరూరీ టెర్రర్ గ్రూప్ పొలిటికల్ బ్యూరో డిప్యూటీ చీఫ్, వెస్ట్ బ్యాంక్‌లోని హమాస్ మిలటరీ విభాగానికి నాయకుడిగా పరిగణించబడ్డాడు. ఈ భవనాన్ని ధ్వంసం చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ శిథిలాల దగ్గర బ్యానర్‌ను ఉంచింది. దీనిపై హమాస్, ఇస్లామిక్ స్టేట్ జెండాలు ఒక్కటయ్యాయి. దానిపై Hamas=IS అని రాసి ఉంది. అక్టోబరు 7న ప్రారంభమైన యుద్ధానికి సంబంధించి ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాద సంస్థలు ఒకటేనని ఇజ్రాయెల్ నిరంతరం చెబుతూ వస్తోంది.
Also Read
- Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
- AP Police: ఏపీ పోలీసుల సంచలన ఆపరేషన్.. మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు డంప్ స్వాధీనం..
- Monkey Repellent Tips : ఇంటిపైకి కోతులు వస్తున్నాయా?.. ఈ చిన్న చిట్కాలతో వాటికి చెక్ పెట్టండి
- IPL 2027: KKR వాటా విక్రయానికి రంగం సిద్ధం.. 400 మిలియన్ డాలర్లకు భారీ డీల్..
Also Read: Sachin Pilot: సచిన్ పైలట్, సారా అబ్దుల్లా విడాకులు తీసుకున్నారు.. ఎన్నికల అఫిడవిట్లో వెల్లడి
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది..
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది. దాదాపు 2,500 మంది ఉగ్రవాదులు భూ, గగనతలం ద్వారా ఇజ్రాయెల్ సరిహద్దులోకి ప్రవేశించారు. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పై వేల రాకెట్లను ప్రయోగించారు. ఈ ఉగ్రదాడిలో 1,400 మందికి పైగా మరణించారు. ఇది కాకుండా 230 మంది బందీలను పట్టుకున్నారు. మరణించిన వారిలో ఎక్కువ మంది పౌరులే. చనిపోయిన వారిలో పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. ఈ దాడిలో ఉగ్రవాదులు అనేక కుటుంబాలను పూర్తిగా నాశనం చేశారు.
57 ఏళ్ల అల్-అరౌరీ యుద్ధం మొదలైనప్పటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడేవాడు. నిత్యం మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ భద్రతా దళాలు వారంన్నర క్రితం అల్-అరూరి ఇంటిని స్వాధీనం చేసుకున్నాయి. జూన్ 2014లో ముగ్గురు ఇజ్రాయెలీ యువకులను కిడ్నాప్ చేయడం, హత్య చేయడంతో సహా అనేక ఇతర దాడులను ప్లాన్ చేయడంలో అల్-అరూరీ సహాయం చేసినట్లు ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు.
لحظة تفجير قوات الاحتلال منزل نائب رئيس المكتب السياسي لحركة حماس الشيخ صالح العاروري في بلدة عارورة شمال غرب رام الله pic.twitter.com/BfJgNCwT6q
— القسطل الإخباري (@AlQastalps) October 31, 2023
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
-
CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో ముందున్నాం
-
NTR Dragon: ‘ధురంధర్’ ఫార్ములాను ఫాలో అవుతున్న ఎన్టీఆర్ ‘డ్రాగన్’!
-
Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
-
AP Police: ఏపీ పోలీసుల సంచలన ఆపరేషన్.. మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు డంప్ స్వాధీనం..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..