Canada: సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు బరువు సగటున 3.5 కిలోలు ఉంటుంది. 2.5 కిలోల నుంచి 4.5 కిలోల బరువును సాధారణంగా పరిగణిస్తారు. ఇది ఆరోగ్యం ఉన్న శిశువు బరువు. కొన్ని సందర్భాల్లో పుట్టిన సమయంలో పిల్లల బరువు దీని కన్నా తక్కువగా లేదా ఎక్కువగా ఉండటం చూస్తుంటాం. కానీ చాలా అరుదుగా కొందరు మాత్రం బాహుబలిగా జన్మిస్తుంటారు. తాజాగా కెనడాలో ఓ పిల్లాడి జననం 2010 నుంచి ఉన్న రికార్డులను తుడిపేసింది.
School Teacher: అమెరికాలో దారుణం జరిగింది. మైనర్ విద్యార్థిపై ఓ మహిళా ఉపాధ్యాయురాలు లైంగిక వేధింపులకు పాల్పడింది. మోంట్‌గోమెరి కౌంటీ పోలీసుల ప్రకారం.. 2015లో 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడితో 22 ఏళ్ల మెలిస్సా మేరి కర్టిస్ అనే ఉపాధ్యాయురాలు లైంగిక చర్యలు జరిపింది. ప్రస్తుతం ఈమె వయసు 31 ఏళ్లు. ఈ విషయం బయటకు రావడంతో ప్రస్తుతం పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
South Korea: మనుషుల పనులను, జీవనశైలిని మరింత సులభతరం చేసేందుకు టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అయితే టెక్నాలజీ అనేది భవిష్యత్ తరాల్లో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పలువురు టెక్ దిగ్గజాలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఉపయోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇది భవిష్యత్ తరాల్లో మానవ మనుగడకు ప్రమాదంగా మారే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఇది మానవులకు మరింత సాయంగా ఉంటుందని చెబుతున్నారు.
ISIS: సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు భారీ దాడికి తెగబడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడుల్లో 30 మంది ప్రభుత్వ అనుకూల సైనికులు మరణించారు. ఈ ఏడాది జరిగిన అత్యంత దారుణమైన దాడుల్లో ఇది ఒకటి. ‘‘బుధవారం సిరియాలోని చెక్ పోస్టులు, సైనిక స్థావరాలపై ఐసిస్ ఉగ్రవాదులు ఏకకాలంలో జరిపిన దాడుల్లో 30 మంది మరణించారు. వీరిలో నలుగురు సైనికులు ఉండగా.. 26 మంది నేషనల్ డిఫెన్స్ ఫోర్సుకు చెందిన వ్యక్తులు ఉన్నారు’’ అని బ్రిటన్ లోని సిరియన్…