Pakistan: పోలీసులు లక్ష్యంగా పాక్‌లో బాంబుదాడి.. ఐదుగురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: బాంబు పేలుళ్లతో మరోసారి దాయాది దేశం పాకిస్తాన్ దద్దరిల్లింది. శుక్రవారం పాక్ వాయువ్య ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలో పేలుడు జరిగింది. పోలీసులే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. 21 మంది గాయపడ్డారు. నగరంలోని పోలీస్ పెట్రోలింగ్ రూట్‌కి సమీపంలో బాంబు పేలిందని పోలీస్ అధికారి మహ్మద్ అద్నాన్ తెలిపారు.
అయితే ఈ పేలుడు ఆత్మాహుతి దాడి వల్ల జరిగిందా..? బాంబు అమర్చారా..? అనేది ఇంకా తేలలేదు. ఈ దాడికి తామే పాల్పడినట్లు ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా బాధ్యత వహించలేదు. ప్రస్తుతం దాడి జరిగిన నగరం పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ బార్డర్‌కి సమీపంలో పాకిస్తాన్ గిరిజన ప్రాంతంలో ఉంది. చాలా ఏళ్లుగా ఈ ప్రాంతం ఇస్లామిక్ తీవ్రవాదులకు, పాక్ తాలిబాన్లకు ప్రధాన కేంద్రంగా ఉంది.
Also Read
Read Also: Uttar Pradesh: పార్టీకి స్నేక్ వైన్ సరఫరా.. డ్రగ్స్ కేసులో బిగ్ బాస్ OTT 2 విజేత ఎల్విష్ యాదవ్..
పాకిస్తాన్ ఇటీవల కాలంలో బాంబు దాడులతో సతమతమవుతోంది. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాల్లో తరుచుగా బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. బలూచిస్తాన్ ప్రాంతంలో బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ పాక్ ఆర్మీ, చైనా ఇంజనీర్లే టార్గెట్‌గా దాడులు చేస్తోంది. ఇక వాయువ్య ప్రాంతంలో పాకిస్తాన్ తాలిబాన్లకు పట్టు ఉంది.
మరోవైపు పాకిస్తాన్ బాంబు పేలుళ్లు, ఉగ్రవాద ఘటనల్లో ఆఫ్ఘన్ వాసుల ప్రమేయం ఉందని చెబుతూ, పాక్ లోని తాత్కాలిక ప్రభుత్వం వలసదారులు ముఖ్యంగా ఆఫ్ఘన్ జాతీయులను దేశం వదలి వెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా పేలుడు సంభవించింది. ఇప్పటికే లక్షలాది మంది ఆఫ్ఘాన్లు, పాక్ వదిలి సొంతదేశాలకు వెళ్లారు.
తాజావార్తలు
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!