Putin: రష్యా అధినేత పుతిన్‌ని విమర్శించిన సీనియర్ మిలిటరీ జనరల్ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. లెఫ్టినెంట్ జనరల్ స్విరిడోవ్, స్టావ్‌రోపోల్ ప్రాంతంలోని అతని ఇంటిలో చనిపోయినట్లు రష్యన్ మీడియా తెలియజేసింది. 6వ వైమానికదళం, ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వ్లాదిమిర్ స్విరిడోవ్ మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. ఇతని శవం పక్కనే ఒక మహిళ శవం పడిఉన్నట్లు పోలీసులు తెలిపారు.
China: చైనాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్సులోని లిషి జిల్లాలో లియులియాంగ్ నగరంలోని ఐదు అంతస్తుల భవనంలో ఓ ప్రైవేట్ బొగ్గు గని సంస్థ కార్యాలయంలో గురువారం ఉదయం 7 గంటల ప్రాతంలో మంటలు చెలరేగాయి. రెండో అంతస్తులో ఉన్న ఈ కార్యాలయం నుంచి మిగతా అంతస్తులకు మంటలు విస్తరించాయి. మంటల తీవ్రత ఎక్కువ కావడంతో 26 మంది మరణించారు. 60 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికా లోని న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు శుభవార్త చెప్పింది. ఇక పైన అమెరికా లోని న్యూయార్క్ లోని ప్రభుత్వ పాఠశాలలకు దీపావళి రోజున సెలవు దినంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో జనవరి 7న సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తామని ఆ దేశ ఎన్నికల సంఘం తెలిపింది. రిగ్గింగ్ అవుతుందనే భయంతో ఈ ఎన్నికలను బహిష్కరిస్తామని బెదిరించాయని ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ బుధవారం తెలిపారు. బంగ్లాదేశ్ లోని 300 స్థానాలకు 12వ పార్లమెంటరీ ఎన్నికలు జనవరి 7న జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ హబీబుల్ అవల్ తెలిపారు. రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు పార్టీలు చర్చలు జరపాలని కోరారు.
China: చైనా మరోసారి సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ని ఆవిష్కరించింది. ఇది సెకనుకు 1.2 టెరాబిట్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేయగలదని దీన్ని సదరు కంపెనీ వెల్లడించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. ఈ వేగం ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ వేగంతో పోలిస్తే దాదాపుగా 10 రెట్లు అని చెప్పింది.
Earthquake in Sri Lanka: ద్వీప దేశం శ్రీలంకను భూకంపం వణికించింది. శ్రీలంక రాజధాని కొలోంబోలో భూమి శక్తవంతమైన ప్రకంపనలు సృష్టించింది. దీంతో శ్రీలంక ప్రజలు భయంతో పరుగుల తీశారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టు రిపోర్టు అందలేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సమాచారం మేరకు భూకంప తీవ్రత 6.2 గా నమోదైంది. ఇది అత్యంత శక్తవంతమైన భూకంపంగా అధికారులు వెల్లడించారు. శ్రీలంకకు ఆగ్నేయదిశగా 1,326 కిలోమీటర్ల దూరంలో భూమికి 10…
Top Headlines, Top News, Telangana, Andhrapradesh, Telugu News, Telangana Elections 2023, Telangana Assembly Elections, National News, International News
Israel Hamas War: గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. అయితే దీని కారణంగా ఐరోపాలో కూడా ఉద్రిక్తత గరిష్ట స్థాయికి చేరుకుంది. లండన్, పారిస్, బెర్లిన్ వంటి పెద్ద యూరోపియన్ నగరాల్లో, సెమిట్ వ్యతిరేకులు, ఇజ్రాయెల్ మద్దతుదారుల మధ్య అనేక ఘర్షణలు జరిగాయి.