Israel-Hamas war: ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్యన జరుగుతున్న యుద్ధం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు యుద్దాన్ని విరమించుకోవాలని ప్రపంచ దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. యుద్దాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన గాజాలో కొనసాగుతున్న దాడులను విరమించుకోము అని తెలిపారు. అలా చేస్తే హమాస్‌కు లొంగిపోయినట్టే అవుతుందని అన్నారు. కాల్పుల విరమణకు పిలుపునివ్వడం అంటే ఉగ్రవాదానికి, అనాగరికతకు లొంగిపోవడమేనని.. ఇది జరగదని స్పష్టం చేశారు. కాగా ఉత్తర గాజా లోని శరణార్థి శిబిరంపై మంగళవారం ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో 50 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 150 మంది గాయపడ్డారు. గాజాలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి నెలకొన్నదని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.
Read also:CM KCR: నేటి నుంచి కేసీఆర్ రాజశ్యామల యాగం.. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో మూడు రోజులు
ఇప్పటికే ఈ ఇరు దేశాల పోరులో వేలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. గాజా పరిస్థితి దయనీయంగా మారింది. హమాస్ ఉగ్రవాదుల ఆకస్మిక దాడితో మొదలైన ఈ యుద్ధ జ్వాలా ఎప్పటికి చల్లారుతుందో అని శాంతిని కోరుకునే యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన ఆకస్మిక దాడులు చేసి 1400 మందికి పైగా ఇజ్రాయిల్ ప్రజల ప్రాణాలను తీసింది. దీనితో ఆగ్రహానికి లోనైన ఇజ్రాయిల్ హమాస్ పరిపాలనలో ఉన్న గాజా పైన ప్రతీకార దాడులతో విరుచుకు పడుతున్నది.. ఇప్పటికే గాజాలో 7500 మందికి పైగా ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. అయినా నేటికీ ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునే ఉన్నాయి.