Inter Board : రాష్ట్ర ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేయనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ ప్రకటించారు. పరీక్షల పద్ధతిలో కూడా మార్పులు ఉంటాయని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఆధునిక విద్యను అందించడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని వివరించారు. నవంబర్ నెల నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తరగతులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీనివల్ల భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులు సిద్ధం…
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు ఇంటర్ ఫస్టియర్‌కు సంబంధించి బోటనీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్ష పేపర్లలో తప్పులు దొర్లాయి. బోటనీ, మ్యాథ్స్ పేపర్‌లలో చిన్నచిన్న తప్పులు జరిగినట్టుగా గుర్తించారు.
Inter Board : తెలంగాణలో ఇంటర్ పరీక్షల హడావిడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను కొన్ని ప్రైవేటు కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఇప్పటికే 417 కాలేజీల్లో అద్దెకు సీసీ కెమెరాలు తీసుకున్నారు. కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో ఇప్పటికే కెమెరాలున్నాయి.…
తెలంగాణలో ఇంటర్మీడియట్ కాలేజీల అనుబంధ గుర్తింపులో ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. చాలా జూనియర్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 1471 ప్రైవేటీ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటి వరకు 958 ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు మాత్రమే అనుబంధ గుర్తింపు లభించింది.
ఇంటర్ బోర్డు అధికారుల దౌష్టికం రోజురోజుకు పెరిగిపోతుంది అని ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ పి. మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. ఇంటర్ విద్య మండలిలో తిష్ట వేసిన అధికారుల యొక్క నిర్ణయాలు ఇంటర్ అధ్యాపకుల పాలిట శాపంగా మారుతున్నాయన్నారు.
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ( టీఎస్ బీఐఈ ) 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించింది. 9 నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తులను ఆయా ఇంటర్ కాలేజీల్లో స్వీకరించనున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్ 30వ తేదీ లోపు తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ షెడ్యూల్ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు…
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసారు అధికారులు. ఇందుకోసం తాత్కాలిక మండలి కొత్త షెడ్యూల్ ను విడుదల చేసింది. సప్లమెంటరీ పరీక్షలకు చెల్లింపు ఏప్రిల్ 25 నుండి మే 2 వరకు అధికారులు నిర్ణయించారు. 2024లో సీనియర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్ 3 వరకు నిర్వహించబడతాయి. ఉదయం మొదటి ఏడాది మధ్యాహ్నం రెండవ ఏడాది విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. Also Read: DC vs…
షెడ్యూల్ రాకముందే అడ్మిషన్‌లు తీసుకుంటే ప్రైవేట్ జూనియర్ కాలేజీల పై చర్యలు ఉంటాయని ఇంటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. పీఆర్వోలను పెట్టుకొని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇంటర్‌లో అడ్మిషన్లు చేయిస్తున్నాయనే అంశం తమ దృష్టికి వచ్చిందని బోర్డు వెల్లడించింది.
Inter Board Focus: ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. 9 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. వచ్చే నెల 18న ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరుకానున్నారు.