Jab Khuli Kitaab: ‘జబ్ ఖులి కితాబ్’ ట్రైలర్ విడుదల.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) నుంచి మరో ఆసక్తికరమైన ఒరిజినల్ మూవీ ‘జబ్ ఖులి కితాబ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, దర్శకుడు సౌరభ్ శుక్లా దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే, ఒక పరిణతి చెందిన ప్రేమకథతో పాటు కుటుంబ భావోద్వేగాలను ఎంతో సున్నితంగా చూపించినట్లు అర్థమవుతోంది. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ వివాహ బంధం తర్వాత, గోపాల్ (పంకజ్ కపూర్), అనసూయ (డింపుల్ కపాడియా) విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడం ఈ కథలోని అసలు ట్విస్ట్. చావుబతుకుల మధ్య ఉన్న భార్యను ప్రాణంగా చూసుకునే భర్త, అసలు విడాకులు ఎందుకు అడుగుతున్నాడు? అనే ఆసక్తికరమైన అంశంతో ఈ ట్రైలర్ సాగింది.
Also Read : Sivaji Raja: నటుడు శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం!
Also Read
- Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
- 9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
- Bhuvneshwar Kumar: మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్.. భువనేశ్వర్ కుమార్‌పై మళ్లీ వేటు..?
- AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
ఈ సినిమా గురించి పంకజ్ కపూర్ స్పందిస్తూ.. ‘ప్రేమ అనేది వయసుతో మసకబారదని, కాలానికి అనుగుణంగా అది మారుతూ ఉంటుందని ఈ సినిమా చెబుతుంది. సౌరభ్ శుక్లా రాసిన ఈ వాస్తవిక కథలో భాగమవ్వడం గొప్ప అనుభూతి’ అని అన్నారు. అలాగే డింపుల్ కపాడియా మాట్లాడుతూ, అనసూయ పాత్ర తన మనసుకు ఎంతో దగ్గరైందని, తన వైవాహిక బంధం విషయంలో నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించే ఒక ధైర్యవంతురాలైన మహిళగా ఈ పాత్ర కనిపిస్తుందని తెలిపారు. అపరశక్తి ఖురానా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం హాస్యం, భావోద్వేగాల కలయికగా ఉండబోతోంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 6, 2026 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.
తాజావార్తలు
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
iQOO Neo 12: 9000mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లేతో.. iQOO Neo 12 పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ లాంచ్!
-
Musheer Khan Record: 21వ శతాబ్దంలోనే మొదటిసారి.. ముషీర్ ఖాన్ అరుదైన ఘనత!
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
-
Bhuvneshwar Kumar: మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్.. భువనేశ్వర్ కుమార్‌పై మళ్లీ వేటు..?
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!