Inter Board : ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ( టీఎస్ బీఐఈ ) 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించింది. 9 నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తులను ఆయా ఇంటర్ కాలేజీల్లో స్వీకరించనున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్ 30వ తేదీ లోపు తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ షెడ్యూల్ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు అన్ ఎయిడెడ్, కో-ఆపరేటివ్, TS రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ఇన్సెంటివ్, మైనారిటీ, KGBV, TMRJCలు, TS మోడల్ జూనియర్ కాలేజీలు మరియు రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సును అందిస్తున్న కాంపోజిట్ డిగ్రీ కాలేజీలకు వర్తిస్తుంది.
ప్రధానోపాధ్యాయులు పదో తరగతి ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా తాత్కాలిక అడ్మిషన్లు చేసుకోవచ్చు. విద్యార్థులు చివరిగా చదివిన పాఠశాల అధికారులు జారీ చేసిన ఒరిజినల్ ఎస్‌ఎస్‌సి పాస్ సర్టిఫికేట్ మరియు బదిలీ సర్టిఫికేట్‌ను సమర్పించిన తర్వాత తాత్కాలిక అడ్మిషన్లను నిర్ధారించాలని TS BIE తెలిపింది. తల్లిదండ్రులు, విద్యార్థులు అనుబంధ కళాశాలల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలని టీఎస్ బీఐఈ కోరింది. అనుబంధ కళాశాలల జాబితా TSBIE యొక్క అధికారిక వెబ్‌సైట్‌లలో అందించబడింది, అంటే https://acadtsbie.cgg.gov.in/ మరియు https://tsbie.cgg.gov.in/ లో చూడొచ్చు. ఇక ఇంటర్‌లో ప్రవేశం తీసుకోవాలనుకునే విద్యార్థులు ఇంటర్నెట్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డు తప్పనిసరిగా దరఖాస్తుకు జతపరచాలి. ప్రొవిజినల్ అడ్మిషన్ పూర్తయిన తర్వాత కచ్చితంగా ఒరిజినల్ మెమోతో పాటు టీసీ సమర్పించాల్సి ఉంటుంది. పదో తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాల కోసం ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకూడదని ఆయా కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది.
Also Read
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!