Inter Board Focus: ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. వచ్చే నెల 18న ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరుకానున్నారు. ఈ రెండు పరీక్షలను ప్రభుత్వం కీలకంగా పరిగణిస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులు సమీక్షించారు. పరీక్షల సరళిపై కూడా ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పరీక్షల నిర్వహణ గతానికి భిన్నంగా ఉండాలన్నారు. ఎక్కడా పేపర్ లీకేజీలు ఉండకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారుల్లో టెన్షన్ కనిపిస్తోంది. ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటారు. ప్రశ్నా పత్రాల రూపకల్పన మొదలుకొని వాటి బట్వాడా, పరీక్ష అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకన కేంద్రాలకు తరలించడం, మూల్యాంకనం నిర్వహించడం, క్రోడీకరించడం, ఫలితాల వెల్లడి వరకు సిబ్బందిని మరింత అప్రమత్తం చేశారు.
Read also: Papua New Guinea: పాపువా న్యూ గినియాలో రెండు తెగల మధ్య గొడవ.. 53 మంది మృతి
గతంలో ఎలాంటి ఫిర్యాదులు లేని వారికే ప్రాధాన్యత ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్ టికెట్ల జాప్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించనున్నారు. పరీక్షల సమయంలో ఫీజులు కట్టని విద్యార్థులపై ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. డౌన్‌లోడ్ చేసిన హాల్‌టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్, పాఠశాల హెచ్‌ఎంల సంతకాలు అవసరమనే ఆరోపణలున్నాయి. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందస్తుగా హాల్ టిక్కెట్ల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. ఏళ్ల తరబడి ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణ అధికారులకు సవాల్‌గా మారింది. హాల్ టిక్కెట్ల నుండి ఫలితాల వరకు, ఏదో తప్పు జరుగుతుంది.
Read also: Kalki Dham Temple: కల్కి ధామ్ ఆలయానికి ఈ రోజు ప్రధాని మోడీ శంకుస్థాపన..
ప్రశ్నపత్రాల్లో తప్పులు సర్వసాధారణమైపోతున్నాయి. మూల్యాంకనం మరియు ఫలితాల ప్రకటనలో కొన్ని తప్పిదాల కారణంగా 2019లో ఇంటర్ బోర్డు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. అప్పట్లో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. ఆ తర్వాత కూడా ఎక్కడో ప్రశ్నపత్రాల్లో తప్పులు రావడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా బోర్డును అప్రమత్తం చేశారు. నిపుణులతో ప్రశ్నపత్రాలను రూపొందించారు. గతంలో ఎలాంటి వివాదాలు లేని వారిని ఎంపిక చేశారు. అధికారులు ముందుగా ఈ వివరాలను తెప్పించి పరిశీలించారు. గతేడాది పదోతరగతి పరీక్షలు వివాదాలకు దారితీశాయి. పేపర్ లీక్ రాజకీయంగా సంచలనం సృష్టించింది. సమస్యాత్మక కేంద్రాల్లో ఈసారి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రైవేట్ పాఠశాలలతో సంబంధాలున్న ఉపాధ్యాయులను విధులకు దూరంగా ఉంచుతున్నామని అధికారులు చెబుతున్నారు.
Papua New Guinea: పాపువా న్యూ గినియాలో రెండు తెగల మధ్య గొడవ.. 53 మంది మృతి